ఇందిరమ్మ ఇళ్లకు కేసీఆర్ మంగళం

0
472
kcr closed indiramma houses for people

Posted [relativedate]

kcr closed indiramma houses for peopleతెలంగాణలో కాంగ్రెస్ వాసలేమీ ఉండొద్దని కేసీఆర్ ఫిక్సయ్యారు. కాంగ్రెస్ ను ప్రజలకు గుర్తుచేసే స్కీములేవీ సరిగ్గా అమలుకాలేదని చెప్పడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అందుకే అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లపై సీఐడీ విచారణకు ఆదేశించారు. అవినీతి జరిగిందని సభ సాక్షిగా చెప్పారు. కాంగ్రెస్ నేతల భరతం పడతామని హెచ్చరించారు. మళ్లీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటే.. సగం మంది ఉద్యోగులు, కాంగ్రెస్ నేతలు జైల్లోనే ఉంటారని, అందుకే కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని చెప్పుకొచ్చారు కేసీఆర్.

కానీ కక్ష సాధింపు మాత్రం మానలేదు కేసఆర్.. దాదాపు రెండు లక్షల పదివేల ఇందిరమ్మ ఇళ్లే సక్రమమని కేసీఆర్ నిర్థారించారు. లక్షన్నర ఇళ్లు అక్రమమని తేలడంతో.. వాటికి బిల్లుల మంజూరు నిలిపేశారు. ఇప్పుడు సక్రమమని తేలిన వాటికే బిల్లులు విడుదల కానున్నాయి. ప్రభుత్వం గుర్తించిన ఇందిరమ్మ ఇళ్లు పూర్తి కావాలంటే 500 కోట్లు అవసరం. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు హడ్కో రుణం తీసుకుంటున్న తెలంగాణ సర్కారుకి.. ఇది మరింత భారం కానుంది. మరి నిధులు ఉన్న వనరులతో సర్దుబాటు చేస్తారా.. మళ్లీ అప్పు తీసుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపు కూడా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతకుముందు గృహనిర్మాణ శాఖ అధికారులు బిల్లులు చెల్లించేవారు. కానీ కేసీఆర్ అధికారంలోకి రాగానే గృహనిర్మాణశాఖ సిబ్బందిని ఇతర శాఖలకు పంపారు. చాలా మందిని సస్పెండ్ చేశారు. దీంతో ఇప్పుడు బిల్లుల చెల్లింపుకు పంచాయితీ రాజ్ శాఖ సిబ్బందిని డిప్యుటేషన్ పై తీసుకుంటున్నారు. వారికి శిక్షణ ఇవ్వనున్నారు. సిబ్బంది ఇందిరమ్మ ఇళ్లను ఫోన్లో ఫోటో తీసి వెబ్ సైట్లో పెట్టాలి. ఆ ఫోటోల ఆధారంగా బిల్లులు మంజూరు కానున్నాయి.

Leave a Reply