హోదా డిమాండ్ కి కేసీఆర్ కుమార్తె మద్దతు ..

0
494

 kcr daughter mp kavitha demand ap special status
ఆంధ్రాకి ప్రత్యేక హోదా అంశంలో అనూహ్య మద్దతు లభించింది.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె,నిజామాబాదు ఎంపీ కవిత ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు.రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చాలని ఆమె కోరారు.

కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని అనాసాగరం వచ్చిన కవిత ఈ అంశాన్ని లేవనెత్తారు.దక్షిణాది రాష్ట్రాలు హోదాకి అభ్యంతరం చెప్పడం సరి కాదన్నారు.సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని రాజకీయ నిర్ణయాలతో అధిగమించి ఆంధ్రాకి హోదా ఇవ్వాలని ఆమె కేంద్రానికి సూచించారు.

స్వాంతంత్ర్య దిన వేడుకల్లో ఇరుగుపొరుగు రాష్ట్రాలతో స్నేహసంబంధాలు కొనసాగిస్తామని కేసీఆర్ చెప్పిన వెంటనే కవిత చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో ఆసక్తి,చర్చ రేపడం ఖాయం.

Leave a Reply