రైతుకు బేడీలపై కేసీఆర్ ఏమన్నారు..?

0
529
kcr decision on beedi farmers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

kcr decision on beedi farmersఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్కు విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతి భవన్ లో కవులు సినీ దర్శకులు రచయితలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సుమారు ఐదు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో దర్శకులు కవులు రచయితలకు సీఎం కేసీఆర్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. వ్యవసాయాభివృద్ధి – రైతు సంక్షేమంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఈ సమావేశంలో నీటి ప్రాజెక్టులు విద్యుత్ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ హరితహారం టిఎస్ ఐపాస్ ఐటి పాలసీ పేకాట క్లబ్బులు గుడుంబా నివారణ గొర్రెల పెంపకం చేపల పెంపకం చేనేత పరిశ్రమ నవీన క్షౌరశాలలు ఆరోగ్య పరిరక్షణ కేసీఆర్ కిట్ తదితర అంశాలపై కూడా విస్తృతంగా చర్చించారు.

ప్రభుత్వ కార్యక్రమాలపై చైతన్యవంతుల్ని చేసే విధంగా రచనలు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం తెచ్చే మహోద్యమం రావాలని చెప్పారు. రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా పాటలు వీడియో చిత్రాలు రూపొందించాలని సూచించారు. రైతులకు భరోసా ఇచ్చేలా పాటలు చిత్రాలు ఉండాలన్నారు. ఖమ్మంలో రైతుల చేతీలకు బేడీలు వేయడం తప్పు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందిన కాదని చెప్పిన కేసీఆర్ ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

బంగ్లాదేశ్ లో ప్రొఫెసర్ యూనస్ ఖాన్ పొదుపు ఉద్యమం చేపట్టినట్లు ఎస్.కె. డే భారతదేశంలో పంచాయితీ రాజ్ ఉద్యమాన్ని తీసుకొచ్చినట్లు తెలంగాణలో రైతుకు స్వర్ణయుగం తెచ్చే మహోద్యమం రావాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయాభివృద్ధి కోసం రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు పథకాలపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు ఇక మా భవిష్యత్తుకు ఢోకా లేదనే భరోసా రైతాంగంలో కలిగే విధంగా పాటలు రాయాలని వీడియో చిత్రాలు రూపొందించాలని రచనలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

Leave a Reply