అతివలంటే కేసీఆర్ కు అంత అలుసా?

0
359
kcr

Posted [relativedate]

Image result for kcr
తెలంగాణ కేబినెట్ లో ఇప్పటివరకు మహిళలకు చోటు లేదు. సీఎం కేసీఆర్ అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారు తప్ప రెండున్నరేళ్లుగా ఇప్పటివరకు మహిళా మంత్రులకు అవకాశం కల్పించలేకపోయారు. పోనీ పార్టీలోనైనా అతివలకేమైనా ప్రాధాన్యమిచ్చారా అంటే అదీ లేదు.

నిజానికి కేబినెట్ లో చోటుకు అర్హులైన మహిళా నేతలు టీఆర్ఎస్ లో చాలా మందే ఉన్నారు. కొండా సురేఖ, రేఖా శ్యాం నాయక్, కోవా లక్ష్మి, బొడిగె శోభ, గొంగిడి సునీత.. వీరంతా బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారే. ఈ లిస్టులో ఒకరు లేదా ఇద్దరికి మంత్రి పదవి ఇస్తే.. కేసీఆర్ కు లాభమే తప్ప నష్టమేం లేదు. కొండా సురేఖ, కోవా లక్ష్మికి పదవి ఇస్తే.. మహిళా కోటాతో పాటు బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చినట్టూ ఉంటుంది. కానీ సీఎం కేసీఆర్ ఈ లాజిక్ మిస్ అయ్యారు. ఎంతసేపు కుంటిసాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ డైలమాలోనే రెండున్నరేళ్లు గడిచిపోయాయి. చివరకు ఇప్పుడు మహిళా మంత్రి ఊసే ఇప్పుడు లేకుండా పోయింది.

అటు పార్టీలోనూ పెద్దగా మహిళలకు చోటు లేదు. చోటున్నా వారిపేర్లు పెద్దగా బయటకు వినిపించవు. మహిళా ఎమ్మెల్యేలను మినహాయిస్తే ఒక్క తుల ఉమ తప్ప ఎవరూ పెద్దగా బయటకు ఫోకస్ కాలేదు. జాగృతి అధ్యక్షురాలు కవిత ఉన్నా… ఆమె కూడా మహిళల విషయంలో పెద్దగా గొంతెత్తడం లేదన్న విమర్శలున్నాయి.

అయితే మహిళా ప్రాతినిధ్యంపై టీఆర్ఎస్ నాయకులు కొత్త వాదన వినిపిస్తున్నారు. మహిళా నాయకుల్లో అనుభవలేమి ఉందట. అందుకే వారికి అవకాశం ఇవ్వలేకపోతున్నారట. అదే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మరి పెద్దగా అనుభవజ్ఞులు కాని నాయకులకు చాలామందికి పదవులు ఇచ్చారు కదా. ప్రతిభ ఉంటే చాలు.. అనుభవంతో పనిలేదనే విషయాన్ని వారు మర్చిపోతున్నారు.

Leave a Reply