KCR కలగన్న సెక్రటేరియట్ …

0
477

kcr dream secretariat
కృష్ణా పుష్కరాల తర్వాత.. కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులు ప్రారంభించాలని డిసైడైంది సర్కార్. దీనికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పుష్కరాల తర్వాత మంచి ముహూర్తాలు ఉండటంతో.. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ బ్లాక్ లను కూల్చి.. కొత్త వాటిని నిర్మించనుంది ప్రభుత్వం.
ప్రస్తుతం ఉన్న సచివాలయానికి వాస్తు దోశాలున్నాయన్న సీఎం కేసీఆర్.. ఎర్రగడ్డలో సెక్రటేరియట్ నిర్మించాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న దగ్గరే.. కొత్త బిల్డింగ్ నిర్మించేందుకు సీఎస్ నేతృత్వంలో ఓ కమిటీని కూడా నియమించారు సీఎం.

కొత్త సెక్రటేరియట్ నిర్మానానికి కమిటీ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. కొత్త సచివాలయంలో 7 నుంచి 9 అంతస్థుల్లో నిర్మించేలా ప్లాన్ చేస్తోంది సర్కార్. అత్యంత ఆధునిక పద్ధతుల్లో భవనాన్ని నిర్మించనుంది. దాదాపు 20లక్షల చదరపు అడుగుల్లో సచివాలయంతో పాటు.. అసెంబ్లీ భవనం నిర్మించే ప్లాన్ లో ఉంది. అయితే సెక్రటేరియట్ పై ఓ నిర్ణయానికి వచ్చిన సర్కార్.. శాసనసభ, మండలి నిర్మాణంలో ఇంకా క్లారిటీకి రావాల్సి ఉందంటున్నారు రోడ్లు భవనాల శాఖ అధికారులు.
ఉద్యోగులతో పాటు.. విజిటర్స్ కు ఎలాంటి అసౌకర్యం లేకుండా పార్కింగ్, ఇతర వసతులతో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం జరగనుంది.

ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలు 5 నుంచి 6 లక్షల చదరపు అడుగులు మాత్రమే ఉన్నాయి. APకి కేటాయించిన స్థలాన్ని కూడా కలుపుకొంటే… 10 లక్షల ఎస్ఎఫ్టీ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో అన్ని సౌకర్యాలతో సెక్రటేరియట్ నిర్మించనుంది ప్రభుత్వం. పుష్కరాల తర్వత కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని అధికార వర్గాల టాక్.
========

Leave a Reply