అమిత్ షా ని ఢీకొట్టిన కెసిఆర్…

0
403
kcr fires on amit shah words

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

kcr fires on amit shah words
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దండయాత్రకు తెలుగు రాష్ట్రాల్లో ఎదురులేదనుకునే టైం లో ఒక్క మగాడిలా ముందుకొచ్చాడు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు. అమిత్ షా ఈ పర్యటనలో మాట్లాడిన ప్రతి మాటపై కెసిఆర్ కౌంటర్ ఇచ్చారు.

“బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలోమూడు రోజులుగా పర్యటన సాగుతుంది. విలేకరుల ముందు వారు కొన్ని విషయాలు ప్రవేశపెట్టారు. వారు పెట్టిన అంశాలు చాలా అవాస్తవాలు ఉన్నాయి. 90 వేల కోట్లు తెలంగాణ కు ఇప్పటికే ఇచ్చామన్నారు. సరే అని  వదిలేశాం. అమిత్ షా చెప్పింది కరెక్ట్ మేము చర్చకు సిద్ధమన్నారు. వారు పదవులు అనుభవించలేదు కాబట్టి ఆ వ్యాఖ్యలను వదిలేశాం. మళ్లీ ఇప్పుడు వచ్చి మూడు రోజులుగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ దేశంలోనే గొప్ప పాలన ను అందిస్తున్నాం. తెలంగాణ ధనిక దేశం. మేము ప్రపంచంతో పోరాడుతున్నాం. కేసీఆర్ స్వభావం మీకు తెలుసు వ్యక్తిగతంగా నన్ను తిట్టినా నేను పడతాను కాని రాష్ట్రాన్ని తిడితే నా ప్రాణం పోయినా నేను రాజీ పడను.  ఒక నిబద్ధతతో పని చేస్తున్న ప్రభుత్వం మాది. ప్రధాని మోదీ, అనేక మంత్రి కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రానికి వచ్చి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీఎస్ ఐపాస్ గురించి చూసి అభినందించారు. వాటర్ మాన్ గా ఉన్న రాజేంద్ర సింగ్ తెలంగాణ లోని ఒక చెరువుకట్టపై పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. తెలంగాణ మాడల్ ను కాపీ కొట్టండని కేంద్ర మంత్రి ఉమాభారతి 29 రాష్ట్రాలకు సూచించింది. నీతి ఆయోగ్ అధికారులు ఇంతమంది అభినందిస్తుంటే అమిత్ షా గారు మమ్మల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడు చెబితే అది నిజమవునుకుంటారు. నేను మౌనంగా ఉంటే అది నిజమనుకుంటారు. ఇక్కడ బీజేపీ స్థాయి ఏంటో మీకే తెలుసు. నాకు కల పడుతుంది నేను దేశాన్ని పరిపాలిస్తానని, ప్రధాని అవుతానని కాని అది అవుతుందా. వాళ్లా పార్టీ ని విస్తరించుకోవడానికి మేము అభ్యంతరం చెప్పడంలేదు. ఎన్నికల్లో ఎవరితోనో ఒకరితో పోరాడాలి. రాష్ట్రాన్ని పాలిస్తున్న వ్యక్తిగా వారు చెప్పిన అవాస్తవాలను నేను ఖండిస్తున్నాను.

2016-17 లో కేంద్రం నుంచి వచ్చిన డబ్బు రూ.24, 561 కోట్లు. తెలంగాణ దేశానికి ఇచ్చే దానిలో దేశం తెలంగాణ కు ఇచ్చింది సగంకూడా కాదు. ఎవరు ఎవరికి డబ్బులు ఇస్తున్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. కేంద్రానికి రూ.25,452 కోట్లు మైనస్ చేస్తే ఇచ్చే ది మేము.. తెలంగాణ కు మీరిచ్చే బిక్షం మీద బతుకుతున్నట్లు మాట్లాడుతున్నారు. అమిత్ షా మాట్లాడింది అంతా అబద్ధం. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా రూ.20 వేల కోట్లు ఇస్తున్నామంటున్నారు. దేనికి అదనంగా ఇస్తున్నారో చెప్పాలి. ఇంత అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు.

పెన్షన్లకు అయ్యే ఖర్చు రూ.5 వేల కోట్లయితే కేంద్రం నుంచి రూ.209 కోట్లు వస్తుంది. సముద్రంలో కాకి రెట్ట వేసినట్లుగా ఉంది. ఇక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిన్నగా చూపించే ప్రయత్నం చేశారు. ఇవన్ని తప్పుడు ప్రచారం చేసినందుకు  అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నేను చెప్పినవి తప్పయితే నేను సీఎం పదవికి రాజీనామా చేస్తాను ఇది నా ఛాలేంజ్.

నువ్వు తేరాట్ పల్లిలోని దళిత వాడలో పండలేదు, కమ్మగూడెంలో మనోహర్ రెడ్డి మామిడి తోటలో వండింది తిన్నావు.  దళితుల సంక్షేమం కోసం బడ్జెట్ లో కేంద్రం పెట్టేది రూ. 52,392 కోట్లు. తెలంగాణ రాష్ట్రం రూ.31,919 కోట్లు దళితులకు కేటాయించాం. ఎస్సీ, ఎస్టీ ల కోసం మేము ఖర్చు పెడుతున్నాం. కేంద్ర బడ్జెట్ లో 3.93 శాతం మేము ఖర్చు పెడుతున్నాం. నల్గొండలోని అన్నపూర్ణ మెస్ భోజనాన్ని మీరు తిన్నారు.  తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని మీరు క్షించపరిచారు. 

1927 మహాత్మ గాంధీ ఇక్కడ పర్యటించారు.  ఇక్కడ ఐక్యమత్యం, సంస్కృతిని చూసి ఉత్తర భారతీయులు దక్షిణ భారతీయులను చూసి నేర్చుకోవాలని అన్నారు. నోట్ల రద్దు సమయంలో ప్రధానికి దేశంలో ఎవ్వరు చేయని సపోర్ట్ నేను చేశాను. మోదీతో నాకు వైరం లేదు. మేము తెచ్చుకున్న తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి కావాలి. తెలంగాణ ను నిందిచిన ఎవర్వైనా మాకు శత్రువే. ఈ ప్రపంచంలో తెలంగాణను ఎవరు కించపరిచినా మేము క్షమించం. కేసీఆర్ ఎన్నో తుపానులను చూశాడు, ఇది తుపాను కాదు  కద గాలి కూడా కాదు. జనాలకు ఏది మంచిదో దాని కోసం కేసీఆర్ పోరాడతాడు.  తెలంగాణలో బీజేపీ పాత్ర ఏమిటో వాళ్లే నిర్ణయించుకోవాలి”.

Leave a Reply