బాబుకు KCR గండం …

kcr first rank chandra babu fifth rank
మన కత్తే మనకు గుచ్చుకుంటే ..అబ్బా …ఆ బాధ చెప్పేది కాదు ..ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీఎం ల పనితీరు మీద తయారు చేస్తున్న నివేదికలు …వాటిపై వస్తున్న లీకులు ఏపీ సీఎం చంద్రబాబు కి చమటలు పట్టిస్తున్నాయి . ఈ సర్వేలు ,ర్యాంకులు పేరు చెప్పి ఆయన పార్టీ నేతల్ని ,అధికారుల్ని బెదరగొట్టేవారు .ఇప్పుడు అదే అస్త్రం ఆయన మీదకే వస్తోంది .
మోడీ రూపొందిస్తున్న త్రైమాసిక నివేదికలో చంద్రబాబు కి 5 వ ర్యాంకని కొందరు …13 వ ర్యాంకని మరికొందరు కేంద్ర ప్రభుత్వ అధికారులు లీకులిస్తున్నారు …ఇది తెలిసిన ఆయనకు ,ఆయన అభిమానులకు చాలా కష్టం గా ఉంది .ఇదే జీర్ణం కాకపోతుంటే మరో వార్త వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ..అది తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు కి 1 వ ర్యాంక్ అని తెలుస్తోంది ..పాలన వ్యవహారాల్లో తనను కొట్టే వాళ్లే లేరని భావించే బాబు గారికి ఇది పెద్ద షాక్ .
ఏదేమైనా విషయం అధికారికం గా బయటికి వచ్చేదాకా చూడాలి …వస్తున్న లీకులు నిజమే అయితే …నిజం గా బాబు కి గడ్డు పరిస్థితే …నిన్న మొన్నటి దాకా రేటింగ్ ల పేరు చెప్పి హడలగొట్టిన బాస్ కి ఇలా అయితే తెలుగు తమ్ముళ్లు పండగ చేసుకుంటారు .ఇక వైసీపీ సంగతి చెప్పేదేముంది …గులాబీ దండు దండయాత్ర ఎలా ఉంటుందో వేరే చెప్పాలా ? మొత్తం విషయం లో రెండు సానుకూల అంశాలు బాబు కి కన్పిస్తున్నాయి ..మొదటిది ..అధికారికం గా కేంద్రం ఈ నివేదిక బయట పెట్టక పోవడం ..మరోటి … గురువుని మించిన శిష్యుణ్ణి తయారు చేసిన ఘనత దక్కించు కోవడం …నిజమే కదా ..కేసీఆర్ ఆయన శిష్యుడే కదా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here