Posted [relativedate]
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సరికొత్త నివాస భవనం లో సర్వహంగులూ వున్నాయట.రేపు తెల్లవారుజామున అయన కుటుంబసమేతంగా గృహ ప్రవేశం చేయనున్నారు.ప్రస్తుతం బేగంపేటలో ఉన్న సీఎం క్యాంపు ఆఫీస్ వెనుక ఉన్న సువిశాల ప్రాంగణంలో సరికొత్త క్యాంపు ఆఫీస్ ,సీఎం నివాస భవనం, ప్రత్యేక మీటింగ్ హాల్ ని 9 ఎకరాల్లో నిర్మించారు.భవన సముదాయం ముందు పెద్ద ఎత్తున గార్డెన్ పెంచారు .
భద్రతా కారణాల రీత్యా సీఎం కెసిఆర్ ,అయన కుమారుడు Ktr లు వినియోగించే బెడ్ రూమ్, బాత్ రూమ్ లకి సైతం బులెట్ ప్రూఫ్ అద్దాలు వినియోగించారు. వీటి విలువ లక్షల్లో వుంటుందట.9 నెలల్లో పూర్తి చేసిన ఈ భవన అంచనా వ్యయం 38 కోట్లు .