శ‌శిక‌ళ నుంచి కేసీఆర్ కు ప్రాణ‌హాని!!

0
264
kcr having life trouble from seshikala

Posted [relativedate]

kcr having life trouble from seshikala
శ‌శిక‌ళ నుంచి కేసీఆర్ కు ప్రాణ‌హాని ఉందా? మ‌న్నార్గుడి మాఫియా లాంటి మాఫియా ఒక‌టి ఆయ‌న్ను వెంటాడుతుందా? ఆయ‌న చుట్టూ ఉండే కోట‌రీయే ఆయ‌నపై ప‌గ‌బ‌ట్టిందా ? అంటే ఔన‌నే అంటున్నారు కాంగ్రెస్ నాయ‌కులరాలు, కేసీఆర్ స‌మీప బంధువు రేగులపాటి రమ్యారావు.

శ‌శిక‌ళ‌కు కేసీఆర్ ఏంటి సంబంధం అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఎందుకంటే శ‌శిక‌ళ అంటే త‌మిళ‌నాడు శ‌శిక‌ళ కాదు. కేసీఆర్ కు స‌మీప బంధువుల్లోనూ శ‌శిక‌ళ అనే పేరున్న ఆ మ‌హిళ ఉంద‌ట‌. ఆమె నుంచే ఇప్పుడు కేసీఆర్ కు ప్రాణ‌హాని ఉంద‌న్న‌ది ర‌మ్య వాద‌న‌. అంతేకాదు మ‌న్నార్గుడి త‌ర‌హాలో… తెలంగాణ‌లోనూ కుద‌రుపాక మాఫియా ఒక‌టి ఉంద‌ట‌. అదే కేసీఆర్ ను శాసిస్తోంద‌ట‌. మన్నార్గుడి త‌ర‌హాలోనూ కుదురుపాక మాఫియా కూడా తెలంగాణ‌లో అరాచ‌కం సృష్టిస్తోంద‌ని ర‌మ్య అనుమానం. అంతేకాదు కేసీఆర్ చుట్టూ ఉండే కోట‌రీయే ఆయ‌న‌పై ప‌గ‌బట్టింద‌ట‌. ఇక ఆ మాఫియా కేసీఆర్ ప‌డిపోయార‌న్న‌ది ఆమె వాద‌న‌. ఇప్పుడు కేసీఆర్ .. ఒక ర‌బ్బ‌ర్ స్టాంపులా మారిపోయి .. వారు చెప్పిన‌ట్టే వింటున్నార‌ట‌.

ర‌మ్యారావు చేసిన ఈ ఆరోప‌ణ‌లు ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఈ కుదురుపాక మాఫియా క‌థ ఏంటి చ‌ర్చించుకుంటున్నారు జ‌నం. నిజానికి ర‌మ్యారావు చేసిన ఆరోప‌ణ‌లు కేసీఆర్ స‌మీప బంధువుల‌ను టార్గెట్ చేసి.. చేసిన‌వేన‌న్న అనుమానాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే ఈ మ‌ధ్య వారి పేర్లు త‌ర‌చుగా వివాదాలు వినిపిస్తున్నాయి. దీంతో కుదురుపాక మాఫియాపై ఇప్పుడు అనుమానాలు క‌లుగుతున్నాయి. నిజంగానే త‌మిళ‌నాడు త‌ర‌హాలో ఇక్కడ ఏమైనా జ‌రగ‌బోతుందా అన్న చ‌ర్చ జ‌రుగుతుంది. అందుకే తెలంగాణ‌వాదులు కొంద‌రు కేసీఆర్ ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించార‌ట‌. ఎంత‌యినా నిప్పు లేనిదే పొగ రాదు క‌దా!!!

Leave a Reply