Posted [relativedate]
సనత్ నగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన… తలసాని శ్రీనివాస యాదవ్ .. ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం గట్టిగానే ప్రయత్నించారు. అ అవకాశం చేజారింది కానీ… అంతకంటే మంచి పదవి దక్కింది. ఏకంగా కారు ఎక్కసి… మినిస్టర్ పదవిని చేపట్టారాయన. అప్పట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యానే కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారన్నది స్పష్టం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి ఆయనను పక్కనబెట్టనున్నారనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి.
గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పట్లో తలసానికి మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్.కానీ గ్రేటర్ లో ఆయన పెద్దగా పార్టీకి ఉపయోగపడలేదు. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంతా కేటీఆర్ హవానే నడించింది. ఆ ప్రభావంతో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించింది. పోనీ ఆ తర్వాతైనా తలసాని వల్ల టీఆర్ఎస్ కు ఏమైనా ఉపయోగం జరిగిందా అంటే అదీ లేదు. తుమ్మల నాగేశ్వరరావు – జిల్లాలో… మహేందర్ రెడ్డి – రంగారెడ్డి జిల్లాలో… ప్రభావం చూయించినంతగా… హైదరాబాద్ లో తలసాని ప్రభావం పెద్దగా లేదు. పైగా తలసాని వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ తెలంగాణ ద్రోహులకు మంత్రిపదవి ఇచ్చారన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.
ఏ రకంగా చూసినా తలసాని వల్ల డ్యామేజే తప్ప అడ్వాంటేజ్ లేదని కేసీఆర్ లెక్కలు వేసుకున్నారట. అందుకే వేటు వేసేందుకే మొగ్గు చూపుతున్నారని టాక్. ఒకేసారి వేటేస్తే కొంత వ్యతిరేకత వచ్చే అవకాశముంది కాబట్టి… ముందు మినిస్ట్రీలో డిమోషన్ ఇచ్చారట. డిమోషన్ జరిగి కొంత కాలం కూడా జరిగిపోయింది కాబట్టి… తలసానికి మంత్రి పదవి నుంచి ఊస్టింగ్ జరిగే సమయం ఆసన్నమైందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నిజంగానే మినిస్ట్రీ పోతే… తలసాని టీఆర్ఎస్ లోనే ఉంటారా… లేకపోతే మళ్లీ పార్టీ మారుతారా అన్నది చూడాలి!!!