ఇక కేసీఆర్ కి క్వార్టర్లీ పరీక్షలా ?

206
Spread the love

kcr modi telangana

    తెలంగాణ రాజకీయ రధాన్ని ఎదురు లేకుండా నడుపుతున్న ముఖ్యమంత్రి కి ప్రధాని మోడీ క్వార్టర్లీ పరీక్ష పెట్టబోతున్నారు .ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి . ఈ పరీక్ష పెట్టడం లేదనే ఇంతకముందు గులాబీ దండు అలిగింది.ఇప్పుడు ఆ ఇద్దరి ముచ్చటా తీరబోతోంది .అసలు విషయం మరేదో కాదు …మోడీ తెలంగాణ టూర్ …

     ఇంతకముందు ప్రధాని రాష్ట్ర పర్యటనకు రావడం లేదని టీఆరెస్ ప్రభుత్వం వాపోయింది .ఎట్టకేలకు మోడీ టూర్ డిసైడ్ అయ్యింది .ఆగష్టు 7 న తెలంగాణ లోని నాలుగు జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు .మెదక్ జిల్లా గజ్వేల్ లో మిషన్ భగీరథ ,ఆదిలాబాద్ జిల్లాజైపూర్ లోపవర్ ప్లాంట్ ను మోడీ ప్రారంభిస్తారు .కరీంనగర్ జిల్లా రామగుండం లో ఎన్టీపీసీ కొత్త ప్లాంట్,వరంగల్లో టెక్సటైల్ పార్క్ కూడా మోడీ ప్రారంభిస్తారు.

    దీన్ని…పాలనా కోణంలో చూస్తున్న రాష్ట్రసర్కార్  కేంద్ర వైఖరి మారిందని సంబర పడుతోంది .కానీ తెలంగాణ కమల దళం దీనికి రాజకీయ రంగు అద్దుతోంది. తెలంగాణలో పార్టీ ని బలోపేతం చేసేందుకు ఇక మూడు నెలలకోసారి మోడీ తెలంగాణ వస్తారని ఆ పార్టీ నేతలుచెప్తున్నారు .మోడీ,అమిత్ షా జోరు కూడా అలాగే ఉంది.వాళ్ళు మిత్ర పక్షాలనే మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు .ఇక కేసీఆర్ నుఉపేక్షిస్తారా ? మొత్తానికి మోడీ టూర్ విషయంలో కమల దళం చెప్పేది నిజం అయితే …  ఓ వైపు ప్రధాని గా మోడీని గౌరవించడం ..మరో వైపు రాజకీయ ప్రత్యర్థి గా తలపడడం నిజంగా. కేసీఆర్ కి పరీక్షే ..క్వార్టర్లీ పరీక్షే…జనానికి మాత్రం రసవత్తర రాజకీయ పోరు చూసే అవకాశం ఫ్రీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here