కృష్ణా పుష్కరాలు అంటే విజయవాడేనా.. కెసిఆర్ ఘాటు వ్యాఖ్య..

  kcr negative words pushkaraalu

కృష్ణా పుష్కరాలు అంటే విజయవాడ…గోదావరి అంటే రాజమండ్రి అనేలా చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుష్కరస్నానం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. పుష్కరస్నానం అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడం గొప్ప భాగ్యమని అన్నారు. అమ్మవారి దయతోనే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. వర్షాలు పుష్కలంగా పడి ప్రాజెక్ట్‌లన్నీ నిండాలని ఆకాంక్షించారు. రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని చెప్పారు.
 
ప్రతి ఏడాది 5వేల నుంచి 10 వేలమంది ఉపాసకులు అలంపూర్‌ వచ్చి వెళ్తుంటారన్నారు. జోగులాంబ ఆలయ అభివృద్ధిపై ప్రధానితో మాట్లాడుతానన్న సీఎం అలంపూర్‌లో 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని స్పష్టం చేశారు. సమైక్య పాలనలో జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాలేదని విమర్శించారు. ఆర్డీఎస్‌ కింద 87,500 ఎకరాలకు నీరు రావాల్సిందే అని తేల్చిచెప్పారు. తుమ్మిళ్ల లిఫ్ట్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

SHARE