తెలంగాణ వ్యాలెట్ … కేసీఆర్

Posted November 29, 2016, 11:51 am

 KCR plans to launch e-wallet app for cashless transactions

అవినీతి రహిత దేశం గా భారత దేశాన్ని తీర్చి దిద్ధేందుకు మేము సైతం అంటున్నారు తెలంగాణ ముఖ్య మంత్రి కేసీర్ అన్నారు .తెలంగాణాలో అన్ని ప్రభుత్వ లావాదేవిలను డిజిటల్ దిశ గా మారుస్తున్నామని అన్నారు. తెలంగాణ సచివాలయం లో జరిగిన సమావేశం ఈ మేరకు మాటాడినట్టు చెప్పారు.ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి వీల్లేదన్నారు. అదో పెద్ద సంస్కరణ అన్నారు. నగదు రహిత లావాదేవీలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పెద్దనోట్ల రద్దు అనంతరం పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ఏర్పాటుచేసిన ఉపసంఘాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. నల్ల ధనం సృష్టించింది కాంగ్రెస్ అని అన్నారు సుదీర్ఘ పాలనలో నల్ల కుబేరుల పాలిట కల్ప వృక్షం గా కాంగ్రెస్ పార్టీ మారిందని అన్నారు.

రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు త్వరలోనే ఐటీ శాఖ ఆధ్వర్యంలో టీఎస్‌ వ్యాలెట్‌ను ప్రారంభిస్తామని నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి తీసుకొచ్చే ఈ వ్యాలెట్లపై విధించే ఎండీఆర్‌ ఎత్తివేయాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. అయితే పెద్దనోట్ల రద్దు నిర్ణయంలో కానీ..అమలులో కానీ రాష్ట్రాల పాత్రలేదన్నారు. రాష్ట్రంలో బ్యాంకు అకౌంట్లు లేనివారికి ఖాతాలు తెరిపించి బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిగేలా ప్రోత్సహిస్తామన్నారు. మూడు, నాలుగు గ్రామాలకు ఒక బ్యాంకు ఉండేలా కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 14.5లక్షల స్వైపింగ్‌ యంత్రాలు ఉన్నాయనీ, రాష్ట్రంలో 85వేలు నుంచి లక్ష స్వైపింగ్‌ మిషన్లు ఉన్నాయన్నారు.