అందుకే సచివాలయం కూలుస్తున్నారట..!

 Posted November 4, 2016
kcr-and-ktrతెలంగాణ రాష్ట్రంలో సచివాలయం ఎందుకు కూలుస్తున్నారు..ఇప్పుడు ఈ ప్రశ్నకు చాలామందికి సమాధానం దొరకడం లేదు..దీన్ని అదునుగా తీసుకుని విపక్షాలు సైతం ప్రభుత్వంపై విరుచుకుడుపడుతున్నాయి.. దీనికి సంబంధించిన ఒక స్టోరీ సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది.. కేవలం తన కొడుకుని సీఎం చేయడం కోసమే కేసీఆర్‌ ఈ పని చేస్తున్నట్లు చెప్పే ఆ కథనంలో.. బూర్గులరామకృష్ణరావు, నీలం సంజీవరెడ్డి మొదలుకుని తెలుగు నేలపై ముఖ్యమంత్రిగా చేసిన ఎవరి వారుసులు కూడా సీఎం పదవి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. జలగం వెంగళ్రావు కుమారుడు ప్రసాద్‌ కూడా మంత్రి పదవి వరకు రాగలిగారు కాని ఆ తరవాత ముందుకు కదలలేక పోయారు.
పీవీ నరసింహరావు కూడా సీఎం నుంచి పీఎం వరకు ఎదిగినా ఆయన వారసుల పరిస్థితి అంతే.. అదే కోవలో అంజయ్య, మర్రిచెన్నారెడ్డి, నేదురుమల్లి.. ఇలా చాలా జాబితానే ఉంది.. తాజాగా రాజశేఖర్‌రెడ్డి వారసుడు జగన్‌ పరిస్థితి కూడా అదే.. చివరకు అందరి ఆదరాభిమానాలు చూరగొన్న ఎన్డీయార్‌ కూడా తన కొడుకుల్లో ఎవరికీ ఈ కుర్చీ ఇవ్వలేకపోయారు. కాని అల్లుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఎదిగారు.. సరిగ్గా ఈ అంశమే సీఎం కేసీఆర్‌ని కలవర పెడుతుందంట.. తన తరవాత కొడుకు సీఎం కాకుండా అల్లుడు ఎక్కడ సీటు కొట్టేస్తారో అనే భయంలో ఆయన సచివాలయానికి వాస్తు చికిత్స చేస్తున్నారంటూ నెటిజన్లు చురక వేస్తున్నారు.
SHARE