మోడీకి కేసీఆర్ నమస్కారంపై కూడా రాజకీయమా ?

 kcr recieved modi telangana
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తెలంగాణ పర్యటనకి వచ్చినపుడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అద్భుతం.ఇక సభల్లో మోడీ,కేసీఆర్ పరస్పరం చేసుకున్న ప్రశంసలు చూసి కమలం,గులాబీ నేతలు చిరునవ్వులు కురిపించుకున్నారు.ఒక దశలో గులాబీ దళం మోడీని పొగడ్డానికి పోటీ పడ్డారు.
అయితే ఆ నవ్వులు అంతలోనే అదృశ్యమయ్యాయి.

మోడీ సభల వేడి తగ్గగానే బీజేపీ తొలుత గొంతెత్తింది.కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో 90 వేల కోట్ల రూపాయలు ఇచ్చినందువల్లే తెలంగాణాలో అభివృద్ధి సాధ్యమైందని కమలం నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.దీనికి తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ లెక్కలు చెప్పి మరీ కౌంటర్ ఇచ్చారు .దీంతో రెండు పార్టీల మధ్య ఒక్కసారిగా దూరం పెరిగింది.ఇక టీవీ చర్చల్లోనూ శృతి మించి విమర్శలు చేసుకుంటున్నారు .సాక్షి ఛానల్ లో కృష్ణ సాగర్ అనే కమలం నేత …కేంద్రం సహాయం చేయకపోతే మోడీకి కేసీఆర్ సాష్టాంగపడ్డారని ప్రశ్నించారు ? దీంతో టీయారెస్ నేతలు భగ్గుమంటున్నారు .గౌరవం కోసం వచ్చిన అతిథికి వంగినమస్కారం చేయడాన్ని కూడా రాజకీయం చేస్తే తగదని హితవు చెప్పారు.

SHARE