Posted [relativedate]
తెలంగాణ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాట్లాడారు గ్యాంగ్ స్టర్ నయీంకు సహకరించిన వారు ఎవరైనా శిక్ష తప్పదని స్పష్టం చేశారు.నయీం ఎన్కౌటంటర్పై చర్చలో భాగంగా అయన మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వంపై ప్రతిపక్షాలునిందలు వేయడం పరిపాటిగా మారిందని నయీం అనే అరాచకాన్ని సృష్టించిన వారెవరో అందరికీ తెలుసని అధికారంలో కాంగ్రెస్ వున్నప్పుడే నయీం అరాచకాలు విజృంభించాయని కౌటర్ ఇచ్చారు. తాను వెలిగొండ సభలోనే నయీం అరాచకాలపై మాట్లాడానని గుర్తు చేశారు. నయీం బాధితులు ఎన్కౌంటర్ విష్యం తెలియగానే పండగ చేసుకొన్నారు అన్నారు.
తెరాస ప్రభుత్వానికి ఈ కేసు విషయంలో పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని కేసు దర్యాప్తు దశలో ఉండగా అన్ని విషయాలు బయటపెట్టలేమని సభకి చెప్పారు.నయీం నేర సామ్రాజ్యంలో పాలుపంచుకున్న వారు ఏ పార్టీలో ఉన్నా విడిచిపెట్టేదిలేదని హెచ్చరించారు.నయీం కేసును సీబీఐకి అప్పగించే ప్రసక్తేలేదని, తెలంగాణ పోలీసులపై తమకు నమ్మకం ఉందని అన్నారు. నయీం ముఠాలో బయట ఉన్నవారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు.ఎప్పటి వరకు 26 హత్యకేసుల్లో నయీంపై ఆధారాలు లభించాయని,మరో 26 కేసులపై విచారణ జరుగుతోందని వివరం ఇచ్చారు …