Posted [relativedate]
గౌతమీపుత్ర శాతకర్ణి స్పెషల్ షో చూడాలని ఆహ్వానించిన నందమూరి నట సింహం బాలయ్యకి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఊహించని షాక్ ఇచ్చారు.కిందటేడాది ఏప్రిల్ 23 న గౌతమీపుత్ర శాతకర్ణి ముహూర్తం షాట్ కి అతిధిగా వచ్చిన కెసిఆర్ ఓ మాట చెప్పారట..ఈ సినిమాని చిరంజీవి,నాగార్జున ,వెంకటేష్,రాఘవేంద్ర రావు,దాసరి నారాయణరావు తదితర చలనచిత్ర రంగ దిగ్గజాలతో కలిసి చూస్తానని కెసిఆర్ అన్నారట.ఇప్పుడు స్పెషల్ షో ఆహ్వానం ఇచ్చిన బాలయ్యకి కెసిఆర్ ఆనాటి మాటలు గుర్తు చేశారట .దాంతో బాలయ్యకి పెద్ద చిక్కొచ్చి పడింది.
చిరంజీవితో బాలయ్యకి వ్యక్తిగత వైరం లేకపోయినా వృత్తిగతంగా ఇద్దరూ పోటీదారులు.పైగా ఇప్పుడు సంక్రాంతికి గౌతమీపుత్ర శాతకర్ణి,ఖైదీ నెంబర్ 150 లతో తలపడుతున్నారు.ఈ టైం లో చిరుని షో కి పిలవడం అంత ఈజీ కాదు.అటు ఏపీలో ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఇబ్బందులు కలిగించారన్న వార్తలు వస్తున్నాయి. ఈ టైం లో ఆయన్ని బాలయ్య పిలవలేరు. అటు నాగార్జునతో కొన్నాళ్లుగా బాలయ్యకి మాటల్లేనంతగా సంబంధాలు చెడిపోయాయి..ఈ విషయం బహిరంగ రహస్యమే ..ఆ ఇద్దరినీ పిలవాలని కెసిఆర్ చేసిన సూచనకు బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి.