కెసిఆర్ కి ఇవ్వడానికి బాబెవరు?

 Posted October 26, 2016

kcr send governor to ask chandrababu hyderabad secretariat issue
ఏపీ ఉద్యోగులు వెలగపూడి తరలివెళ్లడంతో హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యకలాపాలకు కేటాయించిన భవనాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కన్నుపడింది.ఆ భవనాల కోసం గవర్నర్ నరసింహన్ ని రాయబారం పంపారని కూడా వార్తలొస్తున్నాయి.చంద్రబాబు స్పందన ఏమిటన్నది తెలియకపోయినా అసలు వాటిని కెసిఆర్ కి అప్పగించే అధికారం,హక్కు చంద్రబాబుకి ఉన్నాయా అన్నదే అసలైన ప్రశ్న..ఈ ప్రశ్న వస్తోంది వైసీపీ నుంచి మాత్రమే కాదు ..సొంత పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారుల నుంచి కూడా ..

విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని.ఈ పదేళ్ళపాటు హైదరాబాద్ లో ఉన్న వసతుల్ని ఏపీ వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.కానీ ఐదేళ్లకి అధికారం కోసం ఉన్న ప్రభుత్వం రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని చేసిన అంశాలపై ఎలా నిర్ణయం చేస్తుందని కొందరు ప్రశ్నిస్త్తున్నారు.హైదరాబాద్ సచివాలయ భవనాలని కెసిఆర్ సర్కార్ కి బాబు అప్పగిస్తే అది లేని అధికారాన్ని చెలాయించడమేనని ఓ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానిస్తే.. ఒకప్పడు హైదరాబాద్ లో ఆంధ్ర పోలీస్ స్టేషన్ పెడతామన్న నేతలు ఇప్పుడెందుకు నోరు తెరవడం లేదని ఓ సీనియర్ మంత్రి బహిరంగంగానే అంటున్నారు. ఈ మాటలు బాబు చెవిదాకా చేరతాయో లేదో ..

SHARE