శ్రీవారికి మొక్కులు చెల్లించుకోనున్న కేసీఆర్!!!

Posted February 17, 2017

kcr to gift gold to tirumala balaji
తెలంగాణ వ‌స్తే తిరుమ‌ల శ్రీవారికి స్వ‌ర్ణ‌కానుక‌లు చేయిస్తాన‌ని సీఎం కేసీఆర్ గ‌తంలో మొక్కుకున్నారు. ప్ర‌త్యేక‌రాష్ట్రం సిద్ధించ‌డంతో ఆ మొక్కుల‌ను చెల్లించుకోవ‌డానికి ముఖ్య‌మంత్రి సిద్ధ‌మ‌య్యారు. రెండేళ్ల నుంచి అనుకుంటూనే ఉన్నారు.. కానీ ఆ స‌మ‌యం ఇప్పుడు వ‌చ్చింది. ఈనెల 22న తిరుమ‌ల శ్రీవారికి మొక్కులు చెల్లించుకోబోతున్నారాయ‌న‌.

ఈనెల 21న కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల‌కు విచ్చేయ‌నున్నారు కేసీఆర్. 22న శ్రీనివాసుడి మొక్కులు చెల్లిస్తారు. ఈ మేర‌కు 14 కిలోల సాలిగ్రామ హారాన్ని, 5 కిలోల ఐదు పేట కంఠె ఇప్ప‌టికే సిద్ధ‌మైపోయాయి. ఈ మేర‌కు ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం… టీటీడీకి 5 కోట్ల రూపాయ‌ల‌ను కూడా అంద‌జేసింది. టీటీడీ సూచ‌న మేర‌కు… కోయంబ‌త్తూర్ కు చెందిన కీర్తిలాల్ జువెల‌ర్స్ ఈ ఆభ‌ర‌ణాలను త‌యారుచేసింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తిరుమ‌ల‌కు విచ్చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఆ శ్రీనివాసుడి ద‌య‌తోనే రాష్ట్రం సిద్ధించింద‌ని కేసీఆర్ బ‌లంగా న‌మ్ముతున్నారు. అందుకే టీఆర్ఎస్ శ్రేణులనుకూడా త‌న‌వెంట తీసుకొచ్చి… శ్రీవారి ద‌ర్శ‌నం చేయించేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌.

SHARE