చంద్రబాబు, జగన్ ను రౌండప్ చేసిన కేసీఆర్..

141

Posted November 30, 2016, 11:37 am

Image result for kcr jagan and chandrababu

చంద్రబాబు, కేసీఆర్ మధ్య కొంతకాలంగా ఎలాంటి హాట్ కామెంట్స్ లేవు. ఇద్దరూ సైలెంట్ గానే పని కానిస్తున్నారు. ఆమధ్య అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్తే… కేసీఆర్ చండీయాగానికి చంద్రబాబు వచ్చి వెళ్లారు. ఇలా ఒకరికొకరు సలహాలు, సూచనలిచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇందులో ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయి అని వేరే చెప్పాల్సిన పని లేదు.

 

Image result for kcr chandrababu

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో చంద్రబాబుకు సంబంధించిన సామాజిక వర్గం ఎక్కువగానే ఉంది. బాబు విషయంలో సైలెంట్ గా ఉండడం ద్వారా వారి మెప్పు పొందాలన్నది కేసీఆర్ ఆలోచన. ఇందులో ఆయన సక్సెస్ కూడా అయ్యారని జీహెచ్ఎంసీ ఎన్నికలు నిరూపించాయి. అటు చంద్రబాబు కూడా కేసీఆర్ ను పల్లెత్తు మాట కూడా అనడానికి సాహసించడం లేదు. కేసీఆర్ తో సఖ్యతతో ఉండడం ద్వారా పక్కరాష్ట్రాలను కూడా కలుపుకుపోతున్నామనే భావనను క్రియేట్ చేస్తున్నారు. తద్వారా వైసీపీ దూకుడుకు కల్లెం వేసే ప్రయత్నం జరుగుతోంది.

Image result for kcr jagan

ఇక చంద్రబాబు కంటే రెండాకులు ఎక్కువ చదివానని చాటుకుంటున్నారు కేసీఆర్. ఆయన జగన్ విషయంలోనూ చాలా మౌనంగా ఉంటున్నారు. రెడ్డి వర్గానికి చెందిన నాయకత్వాన్ని ఆకట్టుకోవడానికే ఆయన ఇలా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా చేయడం ద్వారా కేసీఆర్ కు మంచి అడ్వాంటేజ్ జరిగిందని చెబుతున్నారు.

మొత్తానికి చంద్రబాబుతో దోస్తానా చేస్తూ.. ఇటు జగన్ తో సైలెంట్ గా ఉంటూ ఇద్దరిని రౌండప్ చేసి కన్ ఫ్యూజ్ చేస్తున్నారు కేసీఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here