బాబుకి అచ్చిరాని “ఉప పదవులు”..

0
298
ke krishna murthy comments on chandrababu

Posted [relativedate]

ke krishna murthy comments on chandrababu
జేసీ కుటుంబానికి మూడు పదవులు ఇచ్చిన అంశాన్ని లేవనెత్తి ఏపీ ఉప ముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణ మూర్తి టీడీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చారు.ముఖ్యంగా సీఎం చంద్రబాబుకి కె.ఈ వైఖరి మింగుడుపడటం లేదు.అసలే చంద్రబాబుకి “డిప్యూటీ—-ఉప “అనేది పెద్దగా అచ్చిరాని వ్యవహారం. ఆయన ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు ఈ డిప్యూటీ లే బాబుని కోలుకోలేని దెబ్బ కొట్టారు. 2004 నుంచి 2014 మధ్య టీడీఎల్పీ ఉపనేతలుగా పని చేసిన వాళ్ళు చాలా మంది బాబుని అదను చూసి దెబ్బ కొట్టారు.2004 లో తొలిసారి ప్రతిపక్ష నేత పాత్ర పోషించిన బాబు టీడీఎల్పీ ఉపనేతలుగా దేవేందర్ గౌడ్,కళా వెంకటరావు,నాగం జనార్దన్ రెడ్డి ని ఎంపిక చేసుకున్నారు.ఆ తరువాత కాలంలో కొత్త పార్టీల ఏర్పాటు లేదా ఇతర పార్టీల్లో చేరడం ద్వారా దేవేందర్ గౌడ్ ,కళా వెంకటరావు కీలక సమయంలో బాబుని,టీడీపీ ని వదిలేశారు.ప్రజారాజ్యంలో చేరిపోయారు.2009 లో టీడీఎల్పీ నేతగా రెండోసారి అవకాశం దక్కించుకున్న నాగం తర్వాత పరిణామాల్లో టీడీపీ కి దూరమయ్యారు.తెలంగాణ ఉద్యమనేతగా ఆవిర్భవించేందుకు ప్రయత్నించి విఫలమై చివరకు బీజేపీ పంచన చేరారు.ఇక తెలంగాణ ఏర్పడ్డాక టీ టీడీపీ ఫోరమ్,టీడీఎల్పీ నేతలుగా పనిచేసిన ఎర్రబెల్లి, తలసాని శ్రీనివాసయాదవ్ వంటి వాళ్ళు కూడా తెరాస గొడుగు కిందకి వెళ్లడం అందరం చూశాం.

ke krishna murthy comments on chandrababu2014 ఎన్నికల తర్వాత ఏపీ లో టీడీపీ అధికారం దక్కించుకుంది.అయితే ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఉప ముఖ్యమంత్రి పదవులు రెండు ఇచ్చారు.పార్టీకి లాయల్ గా ఉంటున్న చినరాజప్ప,కే.ఈ కృష్ణమూర్తి లకి ఈ పదవులు దక్కాయి. ముద్రగడ కాపు ఉద్యమాన్ని సమర్ధంగా తిప్పికొట్టడంలో చినరాజప్ప సక్సెస్ కాలేకపోతున్నారని టీడీపీ లో ఓ వర్గం భావిస్తోంది.దీంతో బాబు కూడా ఆయనకి ప్రత్యామ్న్యాయంగా ఇంకో నేతకి అవకాశం కల్పించవచ్చనే ప్రచారం సాగుతోంది.అదే జరిగితే చినరాజప్ప ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక కె.ఈ కృష్ణ మూర్తి ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎన్నోసార్లు సీఎం చంద్రబాబు వ్యవహారశైలి మీద పరోక్ష వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు.ఇప్పుడు తమ్ముడు ప్రభాకర్ కి ఎమ్మెల్సీ దక్కలేదన్న కోపంతో జేసీ కుటుంబంలో మూడు పదవులు ఎలా ఇచ్చారని నిలదీశారు.కె.ఈ ఇలా స్పందించడం,మళ్లీ మాట సరిదిద్దుకోవడం ఎప్పటినుంచో చూస్తున్న వారికి ఇది కామన్ విషయం అనిపించొచ్చు.అయితే పదవుల పందేరాన్ని బీసీ ల అంశంగా కృష్ణమూర్తి ప్రస్తావించడం చూస్తుంటే అదంత తేలికైన విషయం అనిపించడం లేదు.దీని వెనుక ఏదైనా మర్మం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కర్నూల్ రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఓ దిమ్మ తిరిగే సీక్రెట్ బయటపెడుతున్నారు. తనతో కలిసి చదువుకున్న కె.ఈ కుమారుడుని వైసీపీ లోకి లాగడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడనేది ఆ సీక్రెట్.మంత్రివర్గ విస్తరణలో తన కుర్చీ కదలకుండా చూసుకోడానికి కె.ఈ ఈ అస్త్రం ప్రయోగించారా లేక కొడుకు భవిష్యత్ కోసం వేరే ఆలోచన చేసి ఇలా దూరం అవుతున్నారా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా కే.ఈ షాక్ ఇస్తే మాత్రం బాబుకి ఉప పదవుల ముప్పు సెంటి మెంట్ ఇంకా బలపడుతుంది.

Leave a Reply