ఆ సూర్యాస్తమయంలో స్వర్ణ కాంతులు ..

0
879

ketharnath sun set lights
ప్రకృతి కాంతకు ఎన్ని వన్నెలు …మరెన్ని చిన్నెలు…ఆ కాంతపై …ఆదిత్యుడి కాంతులుపడితే…ఆ మెరుపులు …సోయగాలు …అబ్బా వర్ణించ సాధ్యమా ? అందుకేనేమో సముద్రుడిలోనుంచి సూర్యుడెప్పుడు పైకి లేస్తాడా అని వళ్ళంతా కళ్ళు చేసుకు చూస్తాం.సూర్యోదయపు అందాల్ని ..ప్రకృతి పరవశాన్ని చూసి మైమరచిపోతాం .

కానీ అక్కడ సూర్యోదయం కన్నా సూర్యాస్తమయపు అందాలు మనల్ని కట్టి పడేస్తాయి .అదే కేదార్ నాధ్ …హిమాలయ సానువుల్లో ..శివ సాన్నిధ్యంలో …ఆ పది నిమిషాలు …సూర్యుడు అస్తమించే ఆ పదినిమిషాలు మనల్ని మరోలోకంలోకి తీసుకెత్తాయి .ఒరిగిపోతున్న సూరీడు స్పర్శతో బంగారు వర్ణం దాల్చే హిమశ్రేణులు..పదిజన్మలకు సరిపడా ఆనందాలు పంచుతాయి …

Leave a Reply