ట్వీట్ల తో మళ్ళీ రెచ్చిపోయిన కీరవాణి ..!

0
271
keeravani tweets on ananth sriram

Posted [relativedate]

keeravani tweets on ananth sriramకీరవాణి మళ్ళి తన ట్వీట్ల తో రెచ్చిపోయాడు…కాకపోతే ఈ సారి కొంచెం వ్యంగ్యం గా స్పందించాడు.తెలుగులో చాలామంది దర్శకులకు బుర్రలేదని, వేటూరి, సిరివెన్నెల వంటి రచయితల తర్వాత తెలుగు పాట అంపశయ్య మీద ఉందని బాహుబలి-2 ప్రీ రిలీజ్‌ ఫంక్షన్ కి ముందు కీరవాణి తన ట్విట్టర్ ఎకౌంటులో ట్వీట్లు చేసాడు. వీటి మీద డైరెక్టర్స్ ఎవరు స్పందించలేదు కానీ రామజోగయ్య శాస్త్రి ఐఫా సంబరాలలో , భాస్కర భట్ల ట్విట్టర్ లో కీరవాణి పై కొంచెం ఘాటుగా వ్యంగ్యం గా మాట్లాడారు.” కీరవాణి చాలా మంచి మనిషి. కొత్తవారిని ప్రోత్సహిస్తారు. విశ్వనాథ్‌, దాసరి, రాఘవేంద్రరావు వంటి ప్రముఖ దర్శకుల వద్ద పనిచేశారు. అలాంటిది ఇప్పుడు దర్శకులపైనా, గీత రచయితలపైనా అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ” దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు.

వీటి అన్నింటికీ సమాధానం గా కీరవాణి ఈరోజు ట్విట్టర్ లో మళ్ళి వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు.వీళ్ళ గొడవ లోకి అనవసరం గా గేయ రచయిత అనంత శ్రీరామ్‌ని కూడా పరోక్షం గా లాగారు కీరవాణి.అయిన డైరెక్ట్ గా తమ్మారెడ్డి గారికి ” మేము ఎప్పుడూ తప్పులు చేస్తుంటాం. మీలాంటి పెద్ద మనుషులు వాటిని సరిదిద్దాలి. మీ సలహా మేరకు కొన్ని ట్వీట్లను తొలగిస్తున్నా. తమ్మారెడ్డిగారికి ధన్యవాదాలు ” అని ట్వీట్‌ చేసారు కీరవాణి.

ఇక తెలుగు సినిమా పాటల ఫై కూడా కీరవాణి కొంచెం ఒక రకమైన బావం తో మాట్లాడారు .” గీత రచయిత అనంత శ్రీరామ్‌ సినీ పరిశ్రమ నుంచి తప్పుకుందామనుకుంటున్నాడు. డ్యూయెట్లు, ఐటెమ్‌ గీతాలు అన్నీ హీరోలు, డైరెక్టర్స్‌, సింగర్స్‌ రాసేసుకుంటున్నారట. అనంత్‌కు కేవలం దేశభక్తి గీతాలు మాత్రమే ఇస్తున్నారట. తెలుగు పాట అంపశయ్య మీద లేదు. అయినప్పటికీ అనంతశ్రీరామ్‌ మాత్రం కష్టాల్లోనే ఉన్నాడని” ట్వీట్‌ చేశాడు.

తన ట్వీట్ లని కూడా ఒక సరదాగా “బాహుబలి కోసం పనిచేయాలి కాబట్టి.. లేకపోతే రాజమౌళి తిడతాడు కాబట్టి.. ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేయాలి కాబట్టి.. ఇక సెలవ్‌”అంటూ ముగించారు.చూడాలి కీరవాణి ట్వీట్ల సమరం ఎక్కడి దాక పోతుందో చూడాలి..ఎవరు స్పందిస్తారో ..ఎవరు కీరవాణి కి వత్తాసు పలుకుతారో..!

Leave a Reply