ఆ విషయాన్ని నిరూపిస్తున్న కీర్తి సురేష్‌

0
295
keerthy suresh got many movie chances without exposing

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

keerthy suresh got many movie chances without exposing
టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ఎక్కడైనా ప్రస్తుతం అందంగా ఉన్న వారికే అవకాశాలు ఎక్కువ. నటనపై పెద్దగా పట్టులేకున్నా కూడా ముద్దుగుమ్మలు కాస్త అందాల ప్రదర్శణ చేస్తే చాు వారికి వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే అతి తక్కువ మందికి మాత్రమే అందాల ప్రదర్శణ చేయకున్నా అవకాశాలు వస్తాయి. సౌత్‌లో నిన్న మొన్నటి వరకు నిత్యామీనన్‌ ఉండగా, ఇప్పుడు ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ ఆ పేరును దక్కించుకుంది. అందాల ప్రదర్శనకు మొదటి నుండి కూడా నో చెబుతూ వస్తున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ తన నటనతో ఆకట్టుకుంటూ వస్తుంది.

తెలుగులో మొదట ‘నేను శైలజ’ చిత్రంలో నటించి ఆ తర్వాత నేను లోకల్‌ చిత్రాన్ని చేసింది. రెండు కూడా మంచి విజయాన్ని సొంత చేసుకున్నాయి. ఆ రెండు సినిమాల్లో కీర్తి సురేష్‌ ఎలా కనిపించింది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం కీర్తి సురేష్‌ తెలుగు మరియు తమిళంలో కలిపి దాదాపు పది సినిమాల్లో నటిస్తుంది. వాటన్నింటిలో కూడా ఏమాత్రం హద్దులు దాటకుండా అందాలను చూపకుండా నటించనుంది. పవన్‌ కళ్యాణ్‌తో త్రివిక్రమ్‌ మూవీలో నటిస్తున్న ఈ అమ్మడు ఇంకా పలువురు స్టార్‌ హీరోలతో కూడా నటించేందుకు సిద్దం అవుతుంది. కీర్తి సురేష్‌ అందాల ప్రదర్శణ చేయకున్నా, నటన ప్రతిభ ఉంటే చాలు ఇండస్ట్రీలో రాణించవచ్చు అనే విషయాన్ని నిరూపించింది.

Leave a Reply