Posted [relativedate]
కీర్తి సురేష్.. ఇప్పుడు టాలీవుడ్ లో ఈమె ఓ మోస్డ్ వాంటెడ్ హీరోయిన్. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కుర్రకారు మనసుల్ని దోచకుంది కీర్తి. ఇక నేను లోకల్ సినిమా విజయంతో ఈమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో టాప్ దర్శకుల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ సినిమాల్లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అయితే బరువు పెరగడంతో తమ ప్రాజెక్ట్ ల నుంచి కీర్తిని సదరు దర్శకులు పక్కన పెట్టారని పుకార్లు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే పవన్ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. దీంతో త్రివిక్రమ్.. కీర్తికి బరువు తగ్గమని, లేకుంటే కష్టమని చెప్పాడట. అందుకే ఈ అమ్మడు ఇప్పుడు బరువు తగ్గే పనిలో ఉందట. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి టాప్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వదలుకోకూడని కీర్తి భావించిందట. అందుకే పట్టుదలతో గంటల కొద్దీ జిమ్ లో వ్యాయామం చేస్తోందట ఈ చిన్నది. అంటే కీర్తి తన అభినయంతో పాటు అందంతో కూడా పడగొట్టనుందన్నమాట