ఆ సీడీ లో ఎమ్మెల్యే రాసలీల..ఊడ్చేసిన సీఎం

    kejriwal dismissed aap minister because sex cd scandal
రాజకీయాల్ని క్లీన్ చేస్తామంటూ చీపురు గుర్తుతో ఢిల్లీ సీఎం పీఠం ఎక్కిన కేజ్రీవాల్ కి సొంతిల్లు వూడ్చుకోవడమే సరిపోతోంది.తాజాగా మంత్రి సందీప్ కుమార్ బూతుపురాణానికి సంబంధించిన సీడీ కేజ్రీకి అందింది.అది చూసిన అర్ధ గంట లోపే ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పిస్తూ కేజ్రీ నిర్ణయం ప్రకటించారు.సీడీ ఎంత హాటుగా ఉంటే సీఎం అంత ఘాటుగా స్పందించారో పాపం.

ఎవరు తప్పు చేసినా క్షమించబోమని ఆప్ వర్గాలు పైపై ప్రకటనలు చేస్తున్నప్పటికీ వరస పరిణామాలు పార్టీ,కేజ్రీ భవితకు సవాలుగా మారాయి.గడిచిన 19 నెలల్లో ఇలా ముఖ్యమంత్రి తప్పించిన మూడో మంత్రి సందీప్ కుమార్.ఒకాయన నకిలీ డిగ్రీ పెట్టుకుని,మరొకాయన ఓ బిల్డర్ ని లంచం అడుగుతూ దొరికిపోయారు.ఇప్పుడు మూడోది సెక్స్ సీడీ.ఇక ఆప్ లోని 10 మందికి పైగా ఎమ్మెల్యేలపై కేసులున్న విషయం తెలిసిందే.అదంతా ప్రధాని మోడీ కుట్రని ఇన్నాళ్లు కేజ్రీ వాదిస్తూ వస్తున్నారు.తాజా ఘటనతో ఆప్ డిఫెన్స్ లో పడింది.

SHARE