గుజరాత్ లో పటేళ్లకు కేజ్రీ వల..

0
496

Posted [relativedate]

 kejriwal meet hardik patel
ఢిల్లీ పాలనలో మోడీ వేలు పెడ్తున్నాడన్న ఆరోపణ చేస్తున్న కేజ్రీవాల్ కౌంటర్ వ్యూహం సిద్ధం చేశారు.మోడీకి ఆయువుపట్టులాంటి గుజరాత్ మీద కన్నేశాడు కేజ్రీ.రానున్న ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్ళాడు.ఎక్కడికక్కడ మోడీ విధానాలపై నిప్పులు చెరిగాడు.మోడీకి,గుజరాత్ బీజేపీకి కొన్నాళ్ల పాటు నిద్ర లేకుండా చేసిన పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుడు ,యువ నేత హార్దిక్ తో కేజ్రీ సమావేశమయ్యారు.

గుజరాత్ ఎన్నికల బరిలో ఆప్ ని నిలపాలని భావిస్తున్న కేజ్రీ స్థానికంగా తగిన నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది.అందులో భాగంగానే హార్దిక్ మీద కేజ్రీ కన్ను పడింది.ఆది నుంచి బీజేపీ కొమ్ముకాస్తూ ఇప్పుడు అసంతృప్తితో రగులుతున్న పటేళ్లని ఆప్ గొడుగు కిందకు తెచ్చే శక్తి హార్దిక్ కి ఉందని కేజ్రీ నమ్ముతున్నారు. హార్దిక్ కూడా ఈ ప్రతిపాదనకు ఓకే అన్నట్టు తెలుస్తోంది.త్వరలోనే ఆప్ జెండాతో హార్దిక్ గుజరాత్ లో బీజేపీ ని ఎదుర్కోబోతున్నట్టే కనిపిస్తోంది.

Leave a Reply