కాంగ్రెస్,బీజేపీ కి పెళ్లి అయిందా?

0
285

 Posted [relativedate]

మనుషులకే కాదు పార్టీలకి కూడా పెళ్లయ్యే రోజులొచ్చాయి.ఆ పని కూడా రాజకీయ నేతల చేతులమీదుగానే అవుతోంది.బీజేపీ,కాంగ్రెస్ భార్యాభర్తల్లాంటివని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటున్నారు.పైకి తిట్టుకుంటూ కొట్టుకున్నట్టు కనిపిస్తున్నా కాపురం బాగానే చేస్తున్నారని అయన సూరత్ లో అన్నారు.అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే రగులుకుంటున్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కేజ్రీ ఇలా మాట్లాడారు.అందుకు అయన చెప్పిన కారణం కూడా చిత్రంగానే వుంది. మోడీ ప్రభుత్వం ఇప్పటికి 14 మంది ఆప్ ఎమ్మెల్యేల్ని అరెస్ట్ చేయించిందని…ఎన్ని ఆరోపణలు వచ్చినా ఒక్కసారైనా రాహుల్ జోలికి వెళ్లిందా అని కేజ్రీ ప్రశ్నిస్తున్నారు.

గుజరాత్ రాజకీయాల్లో కూడా ఆప్ ముద్ర కోసం ప్రయత్నిస్తున్న కేజ్రీ అక్కడ అధికార,ప్రతిపక్షాలైన బీజేపీ,కాంగ్రెస్ లని టార్గెట్ చేయడంలో వింతేమీ లేదు. అయితే ఢిల్లీ,పంజాబ్ …ఇప్పుడు గుజరాత్ ఇలా ఆప్ విస్తరణ కోసం కేజ్రీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే జాతీయ రాజకీయాలపై ఆప్ అధినేత కన్ను పడినట్టే వుంది.

Leave a Reply