ఆ స్టూడెంట్స్ పై ఎఫ్ఐఆర్…

 Posted October 15, 2016  kendriya vidyalaya students fight

కేంద్రియ విద్యాలయం (కేవీ)లో ఓ విద్యార్థిని చితకబాదిన వ్యవహారంలో ఇద్దరు తోటి విద్యార్థులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తరగతి గదిలో ఇద్దరు అబ్బాయిలు ఓ విద్యార్థిని అతి అమానుషంగా, కిరాతకంగా చితకబాదిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ వీడియోపై దర్యాప్తు జరిపిన పోలీసులు సెప్టెంబర్‌ 25న ముజఫర్‌పూర్‌లోని కేంద్రియ విద్యాలయంలో ఈ ఘటన జరిగినట్టు గుర్తించారు. 12వ తరగతి విద్యార్థులైన ఇద్దరు అన్నదమ్ములు ఈ విధంగా 11వ తరగతి విద్యార్థిని అతి అమానుషంగా కొట్టినట్టు తేలింది.

ఈ ఇద్దరు నిందితులు పరారీలో ఉన్న ఓ నేరగాడికి సంబంధం ఉన్నవారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈ ఘటనపై కేంద్ర హెచ్చార్డీ శాఖ సహాయమంత్రి ఉపేంద్ర కుశ్వావా నివేదిక సమర్పించాలని పోలీసులు ఆదేశించారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపి.. నిందితులైన ఇద్దరు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్టు కాజి మహమ్మద్‌పుర పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో తెలిపారు. తరగతి గదిలో జరిగిన చిన్న గొడవ కారణంగా ఇద్దరు అన్నదమ్ములు అతి అమానుషంగా జూనియర్‌ విద్యార్థిపై దాడి చేసినట్టు తెలుస్తున్నదని ఆయన వివరించారు.

[wpdevart_youtube]A1TxBvlkiAQ[/wpdevart_youtube]

SHARE