అటు దేవుడు,ఇటు జోస్యుడు మధ్య రజని..

0
539
kerala astrologer says about rajinikanth political career

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

kerala astrologer says about rajinikanth political career
రజని రాజకీయాల్లోకి వస్తాడా..రాడా ? ఎన్నో ఏళ్లుగా ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరక్క కోట్లాది మంది తలైవా అభిమానులు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. సాక్షాత్తు రజని కూడా ఈ ప్రశ్నకు దాదాపు పదిపదిహేనేళ్ళుగా డొంకతిరుగుడు సమాధానాలు ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అభిమానులతో ఫోటోలు తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో రజని రాజకీయ రంగ ప్రవేశం గురించి చర్చలు సాగుతున్నాయి.ఎప్పటిలానే కర్ర విరక్కుండా పాము చావకుండా రజని సమాధానం చెప్పారు.”ఆ దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుందని” రజని చెప్పడంతో భారమంతా దేవుడు మీదే అన్నట్టు ఉంటుంది .కానీ దేవుడు ఏమి చెప్తాడు? ఎవరికి చెప్తాడు ? అందుకే అందరూ రజని వైపే చూస్తుంటారు ఆ దేవుడు మాటగా రజని ఏమి చెప్తాడా అని?

రజని చెప్తున్న ఈ మాటలతో అభిమానులకే కాదు ఆయన రాక మీద ఆశలు పెట్టుకున్న రాజకీయ పార్టీలు సైతం విసిగిపోతున్నాయి.కాకపోతే ఆ విసుగు ప్రదర్శించలేవు కాబట్టి తెలివిగా ఓ జోస్యుడుని రంగంలోకి దించాయి. కేరళ కి చెందిన సదరు జోస్యుడు రాజకీయాల గురించి ఏమి చెప్పినా జరుగుతుందని ఓ నమ్మకం.అందుకే ఆ జోస్యుడు దగ్గరికి వెళ్లి రజని గురించి ఓ జాతీయ పార్టీ నేత అడిగాడట.రజని రాజకీయాల్లో రాణిస్తాడని ఆ జోస్యుడు చెప్పిన మాటని రజనికి చెప్పి ఆయన్ని రంగంలోకి దించాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.రజని మీద ఒత్తిడి పెంచుతోంది.అయితే దేవుడు పేరు చెప్పి తాను ఓ సమస్యకి జవాబు చెబుతుంటే ..ఓ జోస్యుడు చెప్పింది పట్టుకుని పార్టీ లు ఒత్తిడి తేవడంతో రజని నలిగిపోతున్నారట.అందుకే త్వరలో ఈ దాగుడుమూతలకి ఫుల్ స్టాప్ పెట్టే ఓ ప్రకటనతో రజని ముందుకు రాబోతున్నట్టు సమాచారం.

Leave a Reply