కేరళ ఆయుర్వేదం తో స్థూలకాయానికి చెక్..

0
328
kerala ayurvedam treatment for obesity

Posted [relativedate]

kerala ayurvedam treatment for obesityసన్నగా స్లిమ్ గా వున్నా వాళ్ళని చుస్తే ఎవరికైనా మల్లి మల్లి చూడాలని అనిపిస్తుంది, అదే చర్మం మొత్తం సాగిపోయి వొళ్ళు పెరిగిపోయి ఉంటే చూడటం కాదు కదా మనల్ని పలకరించారు కూడా..తద్వారా ఆత్మ న్యూనతా భావం కూడా పెరిగే అవకాశం వుంది. స్థూలకాయాన్ని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే జీవితపు ఆకాంక్షలను దెబ్బతీసే విరుద్ధ పలితాలెన్నో వచ్చి పడే ప్రమాదం ఉంది. అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి మరికాస్త తీవ్రమయ్యే స్థితి కూడా ఏర్పడవచ్చు కలవరపెడుతున్న సమస్య కూడా ఇదే. కేరళ ఆయుర్వేద పద్దతి ద్వారా ఏఈ స్థూల కాయానికి చెక్ పెట్టొచ్చు..

కొందరి శరీరాలు బండబరువుగా ఎందుకు మారిపోతున్నాయి? బరువు కొద్దీ కొద్దీ గా పెరుగుతూ, స్థూలకాయంగా ఎలా మారిపోతోంది? సాధారణంగా స్థూలకాయం రావడానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలి లోపాలే ప్రధాన కారణంగా ఉంటాయి. అవసరానికి మించి తినడం, నియమిత వేళలంటూ లేకుండా భోజనం చేయడం, పగటిపూట అతిగా నిద్రించడం. శరీర శ్రమ బొత్తిగా లేకపోవడం కూడా అధిక బరవుకూ, స్థూలకాయానికి కారణమవులతాయి. జన్యుపరమైన కారణాలతో కూడా కొందరికి స్థూలకాయం వచ్చేస్తుంది.

శరీరంలోని శ్వాసక్రియ నుంచి విసర్జనక్రియ దాకా సాగే మొత్తం జీవక్రియల్లో లోపం ఏర్పడటం స్థూలకాయానికి మూలకారణం. సహజంగా అయితే మనం తీసుకునే ఆహారం సంపూర్తిగా జీర్ణమవుతుంది. అప్పుడే అది శక్తిగా మారుతుంది. అయితే జీవక్రియల్లో లోపాలు ఏర్పడినప్పుడు ఆహార పదార్థాలు సగంసగంగానే జీర్ణమవుతాయి. ఫలితంగా అవి కొవ్వుగానూ, వ్యర్థ, విషపదార్థాలు గానూ శరీరంలో నిలిచిపోతాయి. ఈ స్థితిలో స్థూలకాయమే కాకుండా, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు కూడా మొదలవుతాయి. వీటి తో పాటు థైరాయిడ్‌ సమస్యలు, హర్మోన్‌ అసమతుల్యత ఏర్పడతాయి.

రోజులు గడిచే కొద్దీ స్థూలకాయంతో కొన్ని చిక్కు సమస్యలే వచ్చిపడతాయి. వాటిలో ప్రత్యేకించి మధుమేహం, ఆస్తమా, ఆర్థరైటిస్‌, గుండె జబ్బులు, అధిక రక్తపోటు ముఖ్యమైనవి. స్థూలకాయం అనగానే అదేదో ఆకృతిలో వచ్చే తేడాయే అనుకోవడానికి లేదు. ఇది గుండె, కాలేయం, కీళ్లు, కీడ్నీల వంటి శరీరంలోని కీలక భాగాల పనితీరునే దెబ్బ తీస్తుంది.

స్థూలకాయాన్ని తగ్గించడంలో ఆయుర్వేదం అనుసరించే విధానం అత్యంత సురక్షితమైనది. స్థూలకాయాన్ని, అధిక బరువును సంపూర్తిగా, శాశ్వతంగా తొలగించి వేస్తుంది.స్థూలకాయపు మూల కారణాన్ని కనిపెట్టడం, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, వ్యర్థపదార్థాలను తొలగించడం, అదే క్రమంలో బరువు తగ్గించడం, అప్పటికే వచ్చిపడిన స్థూలకాయపు దుష్ప్రభావాలను తొలగించడం ప్రధానలక్ష్యంగా పనిచేస్తున్నాం. వాత, పిత్త, కఫాలనే ఈ మూడు దోషాల స్థితి గతులు, వారి జీవనశైలి వారి ఆహారపు అలవాట్లు, జీవక్రియల పనితీరు పరిశీలించిన తర్వాతే చికిత్స చేస్తారు..

స్థూలకాయాన్ని తగ్గించే క్రమంలో కడుపులోకి ఇచ్చే కొన్ని మందులు ఉంటాయి. అలాగే పలురకాలైన బాహ్యమైన చికిత్సలు కూడా ఉంటాయి. ఇవి కొవ్వును, విషపదార్థాలను తగ్గిండంలో అద్భుతంగా పనిచేస్తాయి. శరీరంలోని మలినాలను సంపూర్తిగా తొలగించేచికిత్సల వల్ల థైరాయిడ్‌ సమస్యలు, హార్మోన్‌ తేడాలను తొలగించడంతో పాటు ఎముకలు గుళ్లబారిపోయే ఆస్టియోపొరోసిస్‌ను నియంత్రించబడతాయి. అదే క్రమంలో కండరాలు, ఎముకలు బలపడతాయి. నాలుగైదు వారాల థెరపీల లోతైన వైద్యచికిత్సల వ ల్ల 5 నుంచి 10 కిలోల బరువు అవలీలగా తగ్గిపోతారు.

Leave a Reply