కేరళ లో జనతా గ్యారేజ్ షూటింగ్..

mohanlal-junior-ntr-koratal

‘జనతా గ్యారేజ్’ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇది పూర్తైన తరువాత షెడ్యూ ల్ ని కేరళలో ప్లాన్ చేశారు. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకూ అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

కొరటాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంతా, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఒక ముఖ్యమైన పాత్రలో మోహన్ లాల్ కనిపిస్తారు. విలన్‌గా ఉన్నిముకుందన్ నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఐఐటీ స్టూడెంట్‌గా కొత్త లుక్ తో సందడి చేయనున్న ఈ సినిమా అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here