కేశవ …..తెలుగు బులెట్ రివ్యూ

Posted May 19, 2017 at 15:02

keshava movie telugu bullet reviewసమర్పణ: దేవాన్ష్‌ నామా
నిర్మాణ సంస్థ: అభిషేక్‌ పిక్చర్స్‌
తారాగణం: నిఖిల్‌, రీతూవర్మ, ప్రియదర్శి, వెన్నెలకిషోర్‌, నందకిషోర్‌, మధునందన్‌, అజయ్‌, రావు రమేష్‌, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర తదితరులు
సంగీతం: సన్ని ఎం.ఆర్‌
ఛాయాగ్రహణం: దివాకర్‌ మణి
నేపథ్య సంగీతం: ప్రశాంత్‌ పిళ్ళై
కూర్పు : ఎస్‌.ఆర్‌.శేఖర్‌
నిర్మాత: అభిషేక్‌ నామా
కథ, కథనం, దర్శకత్వం: సుధీర్‌ వర్మ

స్వామి రారా సినిమాతో నిఖిల్ కెరీర్ ని గాడిలో పెట్టడమే కాకుండా వినూత్న చిత్రాలు తెరకెక్కించేలా అతనికి స్ఫూర్తినిచ్చిన దర్శకుడు సుధీర్ వర్మ .ఇన్నాళ్లకు మళ్లీ ఆ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకులకి ప్రత్యేక అంచనాలు ఏర్పడ్డాయి .ఆ అంచనాలకి తగ్గట్టు సినిమా ఉందా లేదా ఇప్పుడు చూద్దాం ..

కథ…. తల్లిదండ్రుల హత్యకు హీరో ప్రతీకారం తీర్చుకోవడం అనే ఓ పాత పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది .అయితే భావోద్వేగాలతో ముడిపడ్డ ఆ ప్రతీకారాన్ని ఏ భావోద్వేగాలు లేకుండా హీరో పూర్తి చేయాల్సి ఉంటుంది .ఎందుకంటే హీరోకి అందరిలా కాకుండా గుండె కుడి పక్క ఉంటుంది .దాని వల్ల భావోద్వేగాలకు గురి అయితే హీరో ప్రాణాలకి కూడా ముప్పు ఉంటుంది .అందుకే ఎమోషన్స్ లేకుండా రివెంజ్ తీర్చుకోవడమే ఈ కధలో కొత్తదనం .

ఇక పోలీసులకి కూడా హీరో మీద మొదలైన అనుమానం ధ్రువపడటంతో టెంపో ఇంకా పెరగాలి .కానీ అక్కడనుంచి కథ రొటీన్ ఫార్మటు లోకి వచ్చేసింది.ఫస్ట్ హాఫ్ లో పోలీసుల్ని తప్పించుకుంటూ ప్రతీకారం తీర్చుకునేహీరోని విషయం తెలిసాక కూడా ఎందుకు వదిలేస్తారా అని సగటు ప్రేక్షకుడి డౌట్ కి సెకండ్ హాఫ్ లో సమాధానం దొరకదు .ఇలా సెకండ్ హాఫ్ ఫ్లాట్ అనిపిస్తుంది .ఫస్ట్ హాఫ్ తో అంచనాలు పెంచుకున్న ప్రేక్షకుడికి సెకండ్ హాఫ్ రొటీన్ సీన్స్ పెద్దగా నచ్చవు ఇక నటన పరంగా నిఖిల్ ఇంకా మెరుగయ్యాడు .దర్శకుడు సెకండ్ హాఫ్ ట్రీట్ మెంట్ కొత్తగా రాసుకుంటే సినిమా ఇంకా బాగుండేది .

బలాలు …

ఫస్ట్ హాఫ్
నిఖిల్ క్యారెక్టర్
మ్యూజిక్
ఫోటోగ్రఫీ
కామెడీ

బలహీనతలు …

సెకండ్ హాఫ్ …. లాజిక్ మీద నడిచే కధకి లాజిక్ మిస్ అయ్యే సీన్స్
తెలుగు బులెట్ పంచ్ లైన్ …. కేశవ కి హృదయ సమస్య వుంది
తెలుగు బులెట్ రేటింగ్ …. 2.75

SHARE