బాబు వార్నింగ్ ని లెక్కచేయని నాని..

0
304
kesineni nani comments on bjp

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

kesineni nani comments on bjp
మిత్రపక్షాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వుండాలని ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినప్పటికీ విజయవాడ ఎంపీ కేశినేని నాని వెనక్కి తగ్గలేదు.బీజేపీ తో పొత్తు వల్లే 2014 ఎన్నికల్లో తన మెజారిటీ తగ్గిందని నాని వ్యాఖ్యానించడం మీద కమలనాధులు ఫైర్ అయ్యారు.ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా విజయవాడ రానుండటంతో ఈ విషయం చంద్రబాబు దాకా వెళ్ళింది.దీంతో పరిస్థితి చక్కదిద్దేలా ఆయన ఓ ప్రకటన చేశారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా వున్న ప్రభుత్వం నడుస్తున్నందున మిత్రపక్షపక్షాలపై నోరు జారి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.అయినా 24 గంటలు గడవకముందే కేశినేని నాని ఆ విషయం మీద పాత వైఖరికే కట్టుబడ్డానని ఇటు టీడీపీ కి,అటు బీజేపీ కి కోపం తెప్పించారు.

ఇంతకీ కేశినేని నాని తాజా కామెంట్స్ ఏమిటో మీరే చూడండి..

నా అనాలసిస్ ప్రకారమే నా మెజార్టి గురించి మాట్లాడాను..

కార్యకర్తల్లో మోటివేషన్ కోసమే తప్ప మరో విధంగా మాట్లాడలేదు..

పార్టి సమావేశంలొనే మాట్లాడాను తప్ప బహిరంగ సభలొ మాట్లాడలేదుగా..

నేను మాట్లాడానా, mpగా మాట్లాడానా ,పార్టిగా మాట్లాడానా అనేది అనుకొనేవాళ్ల విచక్షణకే వదిలేస్తున్నాం..

పొత్తులు, నామినేటెడ్ పొస్ట్ లు అనెవి అధిష్డానం చూసుకుంటుంది..

నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా…

నా వ్యాఖ్యలపై చంద్రబాబు వివరణ అడిగితే ఇస్తా…నాకు ఆయనే అదిష్టానం..

నా తలపగిలినా పర్వాలేదు కొండను డికొట్టేందుకు సిద్దమే..అదే నా కన్ఫిడెన్స్ లెవల్….

Leave a Reply