ఓ కేశినేని.. వంద బస్సులు

0
403
kesineni nani fires on rta office for busses

Posted [relativedate]

kesineni nani fires on rta office for bussesకేశినేని ట్రావెల్స్.. ఈ పేరు చెబితే చాలు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన ట్రావెల్స్ బస్సులే గుర్తొస్తాయి. ఎంపీ కేశినేని నానిగా కంటే ట్రావెల్స్ అధినేతగానే ఎక్కువ పేరు తెచ్చుకున్న కేశినేని నాని.. మళ్లీ వేదాంతం మాట్లాడారు. తనకు వ్యవస్థను మార్చడం చేతగాకే వ్యాపారం మూసేశానని, రెండు తెలుగు రాష్ట్రాలు కాకపోతే.. ఇరవై రాష్ట్రాలు రెడ్ కార్పెట్ పరుస్తాయని అన్నారు. అసలు నానిది అహంకారమా, ఆత్మవిశ్వాసమా.. ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఆర్టీఏ ఆఫీస్ పై దాడికి వెళ్లడమే కాకుండా.. సారీ చెప్పమన్నందుకు మనస్తాపానికి గురయ్యానని అనుచరులతో చెప్పించడం కూడా అంత తేలిగ్గా మింగుడుపడే విషయం కాదు.

విజయవాడ ఎంపీగా కేశినేని నానికి మంచి పేరే ఉంది. ఏ సమస్యతో వెళ్లినా ఏదో ఒక పరిష్కారం చూపిస్తారని, స్థానిక మంత్రి కంటే కూడా బాగా స్పందిస్తారని జనంలో అభిప్రాయం ఉంది. కానీ కొద్దిరోజులుగా నాని వ్యవహారశైలి చూస్తుంటే.. ఆయనపై ఉన్న సానుకూల అభిప్రాయం తప్పేమో అని అనుమానపడాల్సి వస్తోంది. కేశినేనిని బస్సుల వ్యాపారం మూసేయమని ఎవరూ చెప్పలేదు. తనంతట తానే క్లోజ్ చేసుకున్నారు. కానీ పరోక్షంగా ప్రభుత్వాన్ని, అధికారుల్ని తప్పుబడుతున్నారు. ఈయన వ్యాపారం బాగా సాగినన్నాళ్లూ గుర్తుకురాని రూల్స్.. ఇప్పుడే గుర్తొచ్చాయా అని ఆర్టీఏ వర్గాలు కూడా సెటైర్లేస్తున్నాయి.

అసలు కేశినేని బాథేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఈయనగారి బస్సులు మాత్రమే తిరగాలా..? ఇతర ట్రావెల్స్ బిజినెస్ చేసుకోవద్దా..? ఇలా అన్నందుకే కోపమొచ్చింది అంటారు నాని. తెలుగు రాష్ట్రాల్లో కాకపోతే ఇతర రాష్ట్రాల్లో బస్సులు తిప్పుతానంటున్న నాని.. ఇన్నాళ్లూ ఆ పని ఎందుకు చేయలేదనే ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు. విజయవాడ కేంద్రంగానే ఆలిండియా ట్రావెల్స్ పర్మిట్ తీసుకుని బస్సులు తిప్పుకుంటే చంద్రబాబు వద్దన్నారా..? ఓవైపు అమరావతికి బ్రాండ్ ఇమేజ్ తేవడానికి సీఎం ప్రయత్నిస్తుంటే.. ఓ అధికార పార్టీ ఎంపీయే తన వ్యాపారాన్ని మూసేసి అధికారులపై తప్పు నెట్టేయడం పారిశ్రామికవేత్తలకు ఎలాంటి సంకేతం పంపుతుందో నానికి తెలియదా..? అన్నీ తెలిసి కూడా వ్యక్తిగత ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించడం పద్ధతి కాదంటున్నాయి టీడీపీ వర్గాలు.

Leave a Reply