Saturday, November 27, 2021
Homelatestకేశినేని నాని దగ్గర అంత ప్లాన్ ఉందా..?

కేశినేని నాని దగ్గర అంత ప్లాన్ ఉందా..?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విజయవాడ ఎంపీ కేశినేని నాని. వరుస వివాదాలతో చంద్రబాబుకు తల బొప్పి కట్టిస్తున్నారు. స్వయంగా అధినేత పిలిచి మందలించినా పద్ధతి మార్చుకోవడం లేదు. ఏపీలో విజయవాడ లోక్ సభ నియోజకవర్గం చాలా కీలకం. ఇక టీడీపీ విషయానికొస్తే. .ఇది ఆపార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత గడ్డ. ఏమాత్రం అటూ ఇటూ అయినా తిప్పలు తప్పవు. అందుకే విజయవాడ ఎంపీ టికెట్ కు టీడీపీలో ఎప్పుడూ టఫ్ ఫైట్ ఉంటుంది. పోయిన సారి ఎన్నికల్లో ఎంతో కష్టపడి టికెట్ తెచ్చుకుని గెలిచారు నాని.

గెలిచిన తర్వాత ఎంపీగా పనితీరు విషయంలో మంచిపేరే తెచ్చుకున్నారు. కానీ అధికారులతో దురుసుగా ప్రవర్తించి బాబు దృష్టిలో పడ్డారు. చివరకు అధినేత తలంటడంతో.. ఆర్టీఏ కమిషనర్ కు సారీ చెప్పినా, తర్వాత ట్రావెల్స్ బిజినెస్ మూసేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. నాలుగు తరాలుగా ట్రావెల్స్ రంగంలో ఉన్న నాని తీసుకున్న నిర్ణయంతో.. పోటీ సంస్థలు కూడా నివ్వెరపోయాయి. అలాంటి షాకులిస్తున్న నాని.. ఇప్పుడు తనకు లేని బిజినెస్.. ఇతరులకు ఎందుకని ట్రావెల్స్ రంగంలో లొసుగులన్నీ బయటకు లాగుతున్నారు.

కేంద్ర స్థాయిలో లాబీయింగ్ చేసి అరుణాచల్ ప్రదేశ్ లో ఏపీ బస్సులు రిజిస్ట్రేషన్ రద్దు చేయించారు. అటు పాండిచ్చేరిలోనూ ఇదే తరహా లాబీయింగ్ మొదలుపెట్టారు. నాని ధీమా చూస్తుంటే.. ట్రావెల్స్ సంస్థల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మరోవైపు నానికి ఈసారి ఎన్నికల్లో విజయవాడ టికెట్ గ్యారెంటీ లేదు. ఓవైపు లగడపాటి, మరోవైపు పురంధేశ్వరి ఈ టికెట్ పై కన్నేశారు. అందుకే ఇప్పట్నుంచే పోరాటాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి.. టికెట్ కొట్టేయాలనేది నాని వ్యూహంగా ఉంది.

- Advertisment -
spot_img

Most Popular