Posted [relativedate]
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం. 150తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కుమ్మేస్తున్నాడన్న విషయం తెలిసిందే. సంకాంత్రి కానుకగా విడుదలైన ఈ సినిమాతో చిరు రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా అదే దూకుడుతో 50 రోజులు పూర్తి చేసుకొని శత దినోత్సవానికి పరుగులు తీస్తున్నాడు ఈ మెగా ఖైదీ.
కాగా టాలీవుడ్ లో కలెక్షన్లపైనే దృష్టిపెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఓ భారీ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. మన మెగాస్టార్ మాత్రం కలెక్షన్లతో పాటు 50 రోజులు పూర్తి చేసి మరో రికార్డును సాధించాడని చెప్పుకోవచ్చు. 53 సెంటర్లలలో 50 రోజులను పూర్తిచేసుకుని అర్ధశతదినోత్సవం అనే మాటను మరో సారి తెరమీదకు తీసుకొచ్చాడు చిరు.
కాగా చిరు పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమా చేయడంతో ఇదంతా సాధ్యమైందని, అదే రాజకీయాల్లోకి వెళ్లకుండా సినిమాల్లోనే కంటిన్యూ చేస్తే ఇంత విజయాన్ని సాధించేవాడు కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి చిరు తన 151వ సినిమాతో కూడా ఇదే రేంజ్ ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.