రీమేక్ అయితే ట్రైల‌ర్ నూ కాపీ కొట్టాలా?

  Posted January 9, 2017
khaidi150 remake katti trailer copyమెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్ కాంబినేష‌న్.. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత చిరు ఎంట్రీ అంటే సినిమా ఏ రేంజ్ లో ఉండాలి. ఇండ‌స్ట్రీ రికార్డ్స్ ను బ‌ద్దలుకొట్టేలా సినిమా ఉండాలి. సినిమా అలా ఉంది అని హింట్ ఇవ్వాలంటే ట్రైల‌ర్ దానికి త‌గ్గ‌ట్టుగా ఉండాలి. కానీ ఇటీవ‌ల విడుద‌లైన ఖైదీనెంబ‌ర్-150 ట్రైల‌ర్ ను చూస్తే అలా అనిపించ‌డం లేదంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు. దానికి కార‌ణం ట్రైల‌ర్ ఇంత‌కుముందే ఎక్క‌డో చూసిన‌ట్టు క‌నిపించ‌డం. 
ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా.. త‌మిళ సినిమా క‌త్తికి రీమేక్. ఎంత రీమేక్ అయినా దాంట్లో కొంచెం అయినా కొత్త‌ద‌నం ఉండాలిగా. కానీ క‌త్తి ట్రైల‌ర్ ను మ‌క్కీకి మ‌క్కీ కాపీ కొట్టేశార‌ట వి.వి. వినాయ‌క్. క‌త్తి ట్రైల‌ర్ ను మొత్తం దించేశార‌ట‌. ట్రైల‌ర్ లో ఎలాంటి కొత్త‌ద‌నం లేద‌ట‌. మ‌రీ ఇంత కాపీ కొట్ట‌డం అవ‌స‌ర‌మా అన్న వాద‌న వినిపిస్తోంది. 
ఎలాగూ సినిమా రీమేకే. ట్రైల‌ర్ కూడా కాపీ కొడితే… ఇక సినిమాలో కొత్త‌ద‌నం ఏముంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సినిమాను కూడా సీన్ల‌తో స‌హా క‌త్తి లాగే తీసేశారా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. ఏదేమైనా చిరు రేంజ్ లో ట్రైల‌ర్ లేదంటున్నారు విమ‌ర్శ‌కులు. ఓవైపు శాత‌క‌ర్ణితో బాల‌య్య ఊపు మీదుంటే.. వినాయ‌క్ ట్రైల‌ర్ విష‌యంలో ఎందుకు ఇంత అజాగ్ర‌త్త‌గా ఉన్నారో ఎవ‌రికీ అర్థం కాని విష‌యం. అస‌లే సంక్రాంతి పండుగ‌. ఈ స‌మ‌యంలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవడానికి ఇంకొంచెం డిఫ‌రెంట్ గా ట్రై చేయాల్సింది అంటున్నారు విమ‌ర్శ‌కులు. 
SHARE