ప్రభాస్‌కు బాలీవుడ్‌ హీరోయిన్‌ మెసేజ్‌.. సంగతేంటో?

Posted April 12, 2017

khaira advani messaged prabhas
‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్‌ హీరోల స్థాయిలో ప్రభాస్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ విడుదలైన తర్వాత ఆ స్థాయి మరింత పెరగడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ రేంజ్‌ మామూలుగా లేదు. బాలీవుడ్‌ రేంజ్‌లో ప్రభాస్‌ స్థాయి ఉంది. బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కూడా ప్రభాస్‌తో నటించేందుకు, కనీసం ప్రభాస్‌తో మాట్లాడేందుకు ఆశ పడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ తనకు ప్రభాస్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. చాలా కాలంగా ప్రభాస్‌తో మాట్లాడాలని, ఆయనను కలవాలని కోరుకుంటుంది. ఒక బాలీవుడ్‌ హీరో ద్వారా ప్రభాస్‌ నెంబర్‌ను పొందిన కైరా అద్వానీ ఒక మెసేజ్‌ను ప్రభాస్‌కు పంపిందట. ఆ మెసేజ్‌కు ప్రభాస్‌ నుండి రిప్లై కూడా వచ్చిందని ఆమె సంబర పడుతూ చెబుతుంది. ఇంతకు ఆమె పంపిన మెసేజ్‌ ఏంటి? ప్రభాస్‌పై ఆమెకు ఇంత మోజు, అభిమానం ఎందుకో అని ప్రస్తుతం సినీవర్గాల వారు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌, సుజీత్‌ల కాంబో సినిమా కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సినిమాలో హీరోయిన్‌ ఛాన్స్‌ కోసం కైరా అద్వానీ ప్రయత్నాలు చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి మనోడికి బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫ్యాన్‌ అంటే మామూలు విషయం కాదు, ప్రభాస్‌కు ‘బాహుబలి 2’ తర్వాత మరింత మంది బాలీవుడ్‌ హీరోయిన్స్‌ అభిమానులు మారిపోతారేమో చూడాలి.

SHARE