కుక్క మాంసం తినండి..ప్రజలకి పిలుపిచ్చిన నేత..

 kim jong uthara korea said dog curry very tasty
ఎవరైనా ఎలాపడితే అలా తింటుంటే ..ఏంటి కుక్కలా ఆ తిండని తిట్టడం చూసుంటాం.కానీ కుక్కనే తినండి …భలే ఉంటుంది ..రుచికి రుచి …ఆరోగ్యానికి ఆరోగ్యం ..ఇదీ ఇప్పటికే చిత్ర విచిత్రాలు చూపిస్తున్న ఉత్తరకొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ఇచ్చిన పిలుపు..పైగా కుక్క మాంసం బలమైన ఆహారం అని కూడా ఆయన సెలవిచ్చారు.

కిమ్ అంత మాట అన్నాక అనుచరగణం ఊరుకుంటుందా? శునక మాంసం తో తరించే పనిలో పడింది.ఇక కిమ్ కి బాకా ఊదడానికి పెట్టుకున్న టీవీ ఛానల్ కుక్క మాంసం కూర తయారీ,ప్రయోజనాల మీద ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తోంది .

మరీ దారుణమైన విషయమేంటంటే కుక్కని కొట్టీకొట్టీ చంపితే మాంసం రుచి పెరుగుతుందని ప్రచారం చేస్తోంది .మొత్తానికి కిమ్ పిలుపు ఉత్తర కొరియా లో కుక్కల పాలిట మృత్యువైంది …ఈ విషయం తెలుసుకొన్న దక్షిణ కొరియా లోని జంతు ప్రేమికులు తమ నిరసన తెలిపారు.ఇలాంటివాటితో మనసు మారే వాళ్ళు అయితే కుక్కలపై అంత కఠినం గా వుంటారా ? ఏదో జరిగి కిమ్ మనసు,రుచి మారాలని కోరుకోవడం తప్ప ప్రస్తుతానికి చేసేదేమీ లేదు..

SHARE