విజయ్ మాల్యాని ఎస్కేప్ చేసింది మోడి నే..మమతా,కేజ్రీవాల్

Posted November 17, 2016

kingfisher vijay malya escaped by modi supportబ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన లిక్కర్ కింగ్ విజయమాల్యా విదేశాలకు పారిపోవడంలో మోదీ సహకారం ఉందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, విమర్శించారు,నోట్ల రద్దు వ్యవహారంలో ప్రధానిమోదీ రూ.8 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు.. అచ్ఛేదిన్ అంటున్న ప్రభుత్వం అచ్ఛేదిన్ ఎక్కడ ఉన్నాయో చూపించాలని సవాల్ విసిరారు. మూడు రోజుల్లో నోట్ల రద్దును నిర్ణయాన్ని తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద చేపలను రక్షించేందుకే మోదీ పెద్ద నోట్లు రద్దు చేశారని ఆరోపించారు. మోదీ పేదల వ్యతిరేకి అని పేర్కొన్న వారు తాము వారి పక్షాన నిలబడతామన్నారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక అత్యవసర స్థితి నడుస్తోందన్నారు.. గనుల ఘనుడు గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె వివాహానికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఆ వివాహంపై దర్యాప్తు ఎందుకు చేయరని నిలదీశారు.

నోట్ల రద్దుకు వ్యతిరేకంగా గురువారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని అజాద్‌పూర్ మండీలో నిర్వహించిన ర్యాలీలో తృణమూల్ చీఫ్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీపై నిప్పులు చెరిగారు.ప్రభుత్వం లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు

SHARE