అన్ని పార్టీల‌ను చుట్టేసిన కిర‌ణ్!!

Posted [relativedate]

kiran kumar reddy not decided which party he will join
ఏపీ మాజీ సీఎం కిర‌ణ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి జై స‌మైక్యాంధ్ర అంటూ కొత్త పార్టీ పెట్టారు. ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఏదీ క‌లిసి రాలేదు. పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఆయ‌న రాజ‌కీయ జీవితం త‌ల‌కిందులైపోయింది. అప్ప‌టిదాకా త‌న వెంట న‌డిచిన నాయ‌కులంతా ఒక్కొక్క‌రుగా అంతా వెళ్లిపోయారు. ఇప్పుడు కిర‌ణ్ ఏకాకిగా మిగిలిపోయారు. దీంతో ఆయ‌న కూడా ఇక ఏదో పార్టీలోకి వెళ్లిపోతార‌ని భావించారు. కానీ న‌ల్లారి వారు మాత్రం ఏ క్లారిటీ ఇవ్వ‌లేదు.
మొద‌ట్లో కిర‌ణ్ బీజేపీలోకి వెళ్తార‌న్న ఊహాగానాలొచ్చాయి. ఆయ‌న‌కు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అవ‌స‌ర‌మైతే కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని అంచ‌నా వేశారు. కానీ ఎందుక‌నో కిర‌ణ్ వెనుకంజ వేశార‌ట‌. దాంతో క‌మ‌ల‌నాథులు కూడా చాలా కాలం పాటు వేచి చూసి.. ఇక లాభం లేద‌నుకొని సైలైంట్ అయిపోయార‌ని స‌మాచారం.

ఆమ‌ధ్య ఇంకో ప్ర‌చారం జ‌రిగింది. కిర‌ణ్ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇస్తార‌ని ఆశించారు. ఏఐసీసీలో మంచి ప‌దవి ఇచ్చే అవ‌కాశ‌ముంద‌ని… కాంగ్రెస్ పెద్ద‌లు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేర‌ని ఊహాగానాలొచ్చాయి. కానీ అది కూడా జ‌ర‌గ‌లేదు.

ఇక కిర‌ణ్-జ‌గ‌న్ మ‌ధ్య ఒప్పందం కుదిరింద‌ని మ‌రికొన్ని పుకార్లొచ్చాయి. కిర‌ణ్ కు పార్టీలో కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌బోతున్నార‌ని లీకులొచ్చాయి. జ‌గ‌న్ కు కిర‌ణ్ తోడైతే చంద్ర‌బాబును ఢీకొట్టడం సులువైతుంద‌ని వైసీపీ వ‌ర్గాలు కూడా భావించాయి. కానీ కిర‌ణ్ అటువైపు కూడా వెళ్ల‌లేదు. బొత్స కూడా ఒక‌టి రెండుసార్లు ఈ విష‌యంలో కిర‌ణ్ తోనూ మాట్లాడార‌ట‌. కానీ అది వ‌ర్క‌వుట్ కాలేదు.

లేటెస్టుగా కిర‌ణ్ పై జ‌రుగుతున్న ప్ర‌చారం ఆయ‌న జ‌న‌సేన‌లో చేరుతార‌ని… ఇందులో ఎంత వాస్త‌వం ఉందో కానీ ఊహాగానాలు మాత్రం జోరుగా సాగాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్- కిర‌ణ్ మ‌ధ్య మంచి అండ‌ర్ స్టాండింగ్ ఉంద‌ని చెబుతున్నారు. ప‌వ‌న్ ఆలోచ‌న‌ల‌కు కిర‌ణ్ కూడా ఫిదా అయిపోయార‌ట‌. కానీ ఎందుక‌నో కిర‌ణ్ … ప‌వ‌న్ తో వెళ్ల‌డానికి వెనుకంజ వేస్తున్నార‌ట‌.

ఇక కిర‌ణ్ వెళ్ల‌డానికి టీడీపీ త‌ప్ప ప్ర‌ధాన పార్టీలేవీ లేవు. ఆయ‌న ఇలాగే డైల‌మాలో ఉంటే కొన్ని రోజుల త‌ర్వాత ఆయ‌న వ‌స్తార‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నా.. లాభం లేదు. ఆల‌స్యం కాకముందే ఆయ‌న ఒక క్లారిటీకి వ‌స్తే బావుంటుంది. లేక‌పోతే కిర‌ణ్ కు అన్ని దారులు మూసుకుపోతాయంటున్నారు విశ్లేష‌కులు.

Leave a Reply