కిర‌ణ్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఖాయ‌మైందా?

 

Posted January 17, 2017

kiran kumar reddy political entry
ఏపీ మాజీ సీఎం పొలిటిక‌ల్ ఎంట్రీ ఖాయ‌మైందా? ఇక ఆయ‌న‌ సెకండ్ ఇన్నింగ్స్ ను మొద‌లు పెట్ట‌బోతున్నారా? ఏపీ రాజ‌కీయాల్లో ఆయ‌న యాక్టివ్ కాబోతున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఎందుకంటే ఇన్నాళ్లూ సైలైంట్ గా ఉన్న కిర‌ణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామ కృష్ణం రాజు, రాయపాటి సాంబశివ రావు సహా 100 మంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను తాజాగా సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై అఫిడవిట్ దాఖలుచేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లను అన్నింటిని కలిపి ఒకేసారి విచారిస్తామని కోర్టు తెలిపింది. అయితే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఈ పిటిష‌న్ వేయ‌డం వెన‌క ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇత‌రుల పిటిష‌న్ల‌ను ప‌క్క‌న బెడితే కిర‌ణ్ కుమార్ రెడ్డి మాత్రం ప‌క్కా ప్లాన్ తో నే పిటిష‌న్ వేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏపీలో ఇక రంగంలోకి దిగాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు తాను గ‌ట్టి ప్ర‌త్య‌ర్థి అని చాటిచెప్ప‌డానికే ఈ పిటిష‌న్ వేశార‌ని టాక్. అందులో భాగంగానే అంద‌రి చూపును త‌న వైపున‌కు తిప్పుకోవ‌డానికి కిర‌ణ్ ఇలా చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.

మొత్తానికి కిర‌ణ్ పిటిష‌న్ అస్త్రం అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకునే అవ‌కాశాలే ఎక్కువగా క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయ‌న పిటిష‌న్ వేసింది రాష్ట్ర విభ‌జ‌న అంశం మీద‌. ఆ పిటిష‌న్ పై సుప్రీం ఎలాంటి తీర్పు ఇచ్చినా… కిర‌ణ్ మాత్రం అన్ని పార్టీల దృష్టిలో ప‌డ‌తారు. జ‌నంలోనూ ఆయ‌న‌కు కొంత మైలేజ్ వ‌స్తుంది. ఇవ‌న్నీ ఆలోచించుకునే కిర‌ణ్ సారు బ్యాటింగ్ మొద‌లుపెట్టార‌ని చెబుతున్నారు. ఇది క‌చ్చితంగా ఆయ‌న‌కు లాభించే అంశమే.

ఇక పార్టీ విష‌యానికొస్తే ఏ పార్టీలో చేరాల‌న్న దానిపై కూడా కిర‌ణ్ ఓ క్లారిటీకి వ‌చ్చేశార‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్త‌య్యాయ‌ట‌. చేర‌డ‌మే మిగిలింద‌ని చెబుతున్నారు. ఉగాది పండుగ‌కు ఆయ‌న ఒక ప్ర‌ధాన పార్టీలో చేర‌బోతున్నార‌ని టాక్. దీనిపై స‌న్నిహితుల‌కు కూడా ఆయ‌న లీకులిచ్చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

SHARE