ఢిల్లీపై కన్నేసిన కిరణ్?

0
680
kiran kumar reddy re entry in politics

Posted [relativedate]

kiran kumar reddy re entry in politics
సమైక్యరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ..ఆ తర్వాత జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టి దెబ్బతిన్నారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమైన ఆయన…. రీఎంట్రీపై ఎప్పట్నుంచో ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీ… జనసేన లో చేరేందుకు ఆయన ప్రయత్నించినా వర్కవుట్ కాలేదట. దీంతో చివరకు మాతృసంస్థ అయిన కాంగ్రెస్ లోనే చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని టాక్. ఆ దిశగా త్వరలోనే ఆయన హైదరాబాద్ లో ఓ మీటింగ్ పెట్టబోతున్నారనే సమాచారం వెలుగులోకి వచ్చింది.

ఈనెల 11న భవిష్యత్ కార్యాచరణపై కిరణ్ చర్చించనున్నారని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో తనతో పనిచేసిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు కిరణ్ అనుచరులతో ఈ మీటింగ్ జరగనుందట. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు కూడా అందాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ కు చెందిన మాజీలు చాలామంది వచ్చే అవకాశాలున్నాయట. మీటింగ్ లో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ రాజకీయాలపైనే కిరణ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆదిశగా ఇప్పటికే హైకమాండ్ తోనూ మాట్లాడినట్టు టాక్. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ ఇప్పట్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అటు టీడీపీ, ఇటు వైసీపీ బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ కు పవర్ ఎలాగూ రాదు కాబట్టి…ఢిల్లీకి వెళ్లడమే మంచిదని ఆయన ఓ నిర్ణయానికి వచ్చేశారట. మాజీలందరినీ వెంట బెట్టుకొని వచ్చేస్తే… ఆయనకు రాజ్యసభ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పెద్దలు సిద్ధంగా ఉన్నారని టాక్. మరి ఈసారైనా కిరణ్ రీఎంట్రీ ఖాయమేనా… లేకపోతే ఎప్పటిలాగే పెండింగ్ లో పడుతుందా.. చూడాలి!!

Leave a Reply