కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ ఫిక్స్..

 Posted November 3, 2016

kiran kumar reddy re entry in politics
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఖరారైంది.విభజన జరిగిన రెండేళ్ల తర్వాత అయన తొలిసారి రాజకీయ పునరాగమనం మీద నోరు విప్పారు.కొన్నిసార్లు అయన బీజేపీ లో చేరతారని..మరికొన్ని సార్లు టీడీపీ లో చేరతారని …తాజాగా అయన అప్పట్లో స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని వార్తలు వచ్చాయి..వస్తున్నాయి.అయితే ఇప్పటిదాకా కిరణ్ కుమార్ రెడ్డి నోరు తెరిచి బయటికి తానేమనుకుంటున్నది చెప్పలేదు.

రెండు రోజులకిందట ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం సొంత నియోజకవర్గానికి వెళ్ళినపుడు కొందరు అనుచరులు తమకి కూడా దారి చూపాలని కోరారు.అప్పుడు నవ్వుతూనే అయన అసలు విషయం బయటపెట్టారు.పెళ్లి కుదిరింది …పెళ్లి కూతురు ఖరారైంది ..ముహూర్తమే మిగిలి వుంది అని చెప్పారు.అంటే అయన చేరబోయే పార్టీ డిసైడ్ అయిపోయింది.ఆ డేట్ ఎప్పుడనేది మాత్రమే తెలియాలి.ఇప్పటికే బాబు,లోకేష్,జగన్,పవన్,చిరు లాంటి నేతలతో కళకళలాడుతున్న ఏపీ రాజకీయ వేదిక కిరణ్ రాకతో ఇంకాస్త మెరిసిపోవడం ఖాయం.

SHARE