గాలిపటం తో తెగిన “మాంజా” సంబంధం

Posted December 15, 2016

kites festival decreasedసంక్రాతి వస్తోందంటే చాలు పిల్లల్లో ,యువతలో గాలి పటాల సందడి మొదలవుతుంది.ఇంట్లోనే గాలిపటాలను తయారు చేసుకోవడం.రంగురంగుల గాలిపటాలను కొనడం, ఇలా సందడి మొదలువుతుంది..ఇదంతా ఒకెత్తు ఐతే మరి యెంత ఎట్టు ఎగరేయాలి ఎలా ఎదుటివాళ్ళ పతంగిని మన పతంగితో కల్టీ కొట్టించాలి ఏ దారం వాడాలి అనే దాని మీద కూడా పెద్ద కసరత్తే ఉండ్తుంది కానీ ఈ ఏడాది ఆ మజా డోస్ కొంచెం తగ్గుతుంది అనే చెప్పాలి ఎందుకంటె బజార్ లో దొరికే మాంజాల్లో హానికరకాలున్నాయి అని గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించింది ఎందుకు నిషేధం విధించారో చూద్దాం.‘మాంజా’పై పూసే గాజు, లోహాల పొడి పూత మనుషులకు, జంతువులకు, పర్యావరణానికి చాలా హాని చేస్తుందని నిషేధించింది.

మాంజా దుష్ప్రభావాలపై జాతీయ కాలుష్య నియంత్రణ మండలికి ఒక నివేదిక అందజేయాలని పిటిషనర్ ని కోరింది ట్రిబ్యునల్ . సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో గాలిపటాలు ఎగురవేసే నిమిత్తం మాంజాను ఎక్కువగా వినియోగిస్తారు. దుష్ప్రభావాలను కలగజేసే ‘మాంజా’ను నిషేధించాలని కోరుతూ న్యాయవాదులు సంజయ్ హెగ్డే, షాదన్ ఫరాసత్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రైబ్యునల్ ఈ ఆదేశాలు జారీ చేసింది. తుది తీర్పు ని బట్టి గాలిపటం ఎగరేద్దామా వొద్దా అనేది డిసైడ్ చేసుకుందాం …

SHARE