కిట్టుగాడు ఇప్పుడు రావట్లేదట..!!

Posted [relativedate]

kittu-unnadu-jagratha-release-postponed

చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా వరుసగా మూడు సినిమాలు హిట్ కొడితే చాలు. ఆ హీరో నెక్ట్స్ చేయబోయే సినిమా గురించి అభిమానుల్లో కాస్తంత ఆసక్తి నెలకొంటుంది. ఈ విధంగానే రాజ్‌ తరుణ్‌ చేసిన ఉయ్యాలజంపాల, కుమారి21F, సినిమా చూపిస్తా మామ, ఈడోరకం ఆడోరకం సినిమాలు సూపర్ సక్సెస్ ను సాధించాయి. దీంతో రాజ్ తరుణ్ నటిస్తున్న  కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త సినిమాపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్ ఏర్పడింది.

వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎప్పుడో పూర్తైనా పలు కారణాల వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అవుతోంది. సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే  బాగుంటుందని భావించిన చిత్రయూనిట్ ఆ సాంగ్ కోసం కథను చెక్కుతూ  వచ్చింది. నిజానికి నవంబర్ నెలలో రిలీజ్ అనుకున్నప్పటికీ ఈ ఐటెం సాంగ్ తో అది కాస్త ఈ నెల 17 కు మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ  నెలలోనే సినిమా రిలీజ్ లేదని తెలుస్తోంది.

అందుకు కారణం సాయి ధరమ్ తేజ్ నటించిన విన్నర్ వస్తుండడమే. దీంతో మార్చి 3న కిట్టుగాడ్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ డేట్ కైనా వస్తుందో లేక  విజయ్ దేవరకొండ ద్వారక సినిమా ఉందని మరో డేట్ ప్రకటిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here