Posted [relativedate]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి మరో హిట్ అందించడానికి రెడీ అవుతున్నామని, కోబలి పేరుతో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని అప్పట్లో త్రివిక్రమ్ టీం వెల్లడించింది. కాగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఆ సినిమా ఇక అటకెక్కేసినట్లేనని సమాచారం. కోబలి స్క్రిప్ట్ ను పూర్తిగా పక్కనపెట్టేసిన త్రివిక్రమ్… పవన్ తో వేరే సినిమాను పట్టలెక్కించే ఆలోచనలో ఉన్నాడట.
ప్రస్తుతం కాటమరాయుడు చేస్తున్న పవన్.. త్రివిక్రమ్ తో ఓ సినిమా, తర్వాత ఏఎం రత్నంతో ఓ సినిమా చేయాలి. ఆ తర్వాత దాసరి, మైత్రి మూవీస్… ఇలా వరుస సినిమాలు పవన్ ముందు క్యూ కట్టాయి. ఇవి కంప్లీట్ అయ్యేసరికి దాదాపు రెండేళ్లు పడుతుంది కాబట్టి కోబలి ఖేల్ ఖతం అయినట్లేనని, ఒకవేళ పవన్ పట్టు బట్టి అదే చేద్దాము అంటే అప్పుడు కోబలి ముందుకు కదులుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.