‘దడ పుట్టిస్తా’ ఆడియో విడుదల చేసిన కొడాలి నాని

0
704

 

  kodali nani release dhada puttista movie audioవిన్ని వియాన్‌, నేహ‌, హ‌రిణి, ఆన్య హీరో హీరోయిన్లుగా నాయ‌ని పృథ్వి రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో పి.జె.ఆర్‌, ఎన్‌.పి.ఆర్ క్రియేటివ్ వ‌ర్క్స్‌, లికి డ్రీమ్‌, స‌త్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం `ద‌డ‌పుట్టిస్తా`. హ‌రీష్‌.ఇ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఎ.థామ్స‌న్ మార్టిన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్‌ రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆడియో సీడీల‌ను ఆవిష్క‌రించారు. ఒక మంచి టీం క‌లిసి చేసిన ఈ ప్ర‌య‌త్నం పెద్ద స‌క్సెస్ కావాలి. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటూ యూనిట్‌ను అబినందిస్తున్నానని కొడాలి నాని యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు.

                       ద‌ర్శ‌కుడిగా  తొలి ప్ర‌య‌త్నం హీరో హేమంత్(విన్ని వియాన్‌) నన్ను న‌మ్మి నాకు అవ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. అందరి సహకారంతో సినిమా చేయగలిగాను అని దర్శకుడు హరీష్.ఇ అన్నారు. మంచి ల‌వ్ ఎంట‌ర్ టైన‌రే కాకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ తో సినిమా ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. సినిమా బాగా వ‌చ్చింది. స‌హ‌కారం అందించిన యూనిట్ స‌భ్యుల‌కు థాంక్స్ అని హీరో విన్ని వియాన్ తెలియజేశారు. సంగీతం అందించడానికి మంచి స్కోప్ ఉన్న సినిమా. పాటలు అందరికీ నచ్చుతాయని భావిస్తున్నానని మ్యూజిక్ డైరెక్టర్ ఎ.థామన్స్ మార్టిన్ అన్నారు. హీరో హేమంత్‌తో నాకు చాలా కాలంగా మంచి ప‌రిచ‌యం ఉంది. త‌ను డిస్ట్రిబ్యూష‌న్‌తో పాటు ఎగ్జిబిట‌ర్‌గా కూడా వ‌ర్క్ చేసేవాడు. ఈ సినిమాతో హీరోగా కూడా మారాడు. ఈ సినిమాకు త‌న‌కు మంచి పేరును తీసుకురావాల‌ని కోరుకుంటున్నానని రంజిత్ మూవీస్ అధినేత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ తెలిపారు. సాంగ్స్ బావున్నాయి. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నానని ఎస్.వి.ఆర్.మీడియా అధినేత్రి సి.జె.శోభ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ధ‌న‌రాజ్‌, వ‌ర్ష‌, క్రాంతి కిర‌ణ్‌, ధీర‌జ్‌, నాయిని పృథ్విరెడ్డి, వంశీ త‌దిత‌రులు పాల్గొని యూనిట్ సభ్యులను అభినందించారు.

Leave a Reply