తెలంగాణ కేజ్రీవాల్ గా కోదండరామ్!!!

Posted January 20, 2017

kodandaram as telangana kejrival
తెలంగాణ జేఏసీ ఛైర్మ‌న్ కోదండరామ్ రాజకీయ పార్టీ దిశ‌గా అడుగులేస్తున్నారు. ఇప్ప‌టికే ఆదిశ‌గా రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని లీకులు వ‌స్తున్నాయి. ఆయ‌న కూడా దీన్ని ఖండించ‌క‌పోవ‌డం చూస్తుంటే కోదండ‌రామ్ పెద్ద స్కెచ్చే వేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే ఆ పార్టీ ఆషామాషీగా ఉండ‌కుండా… తెలంగాణ రాజ‌కీయాల‌నే మ‌లుపుతిప్పేలా ఉండాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. అందుకు ఢిల్లీ క‌సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను స్ఫూర్తిగా తీసుకోవాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నార‌ట‌.

అర‌వింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్ట‌డం, పార్టీ విస్త‌ర‌ణ‌, టిక్కెట్ల పంపిణీ.. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం లాంటి అంశాల‌న్నింటినీ కోదండ‌రామ్ అధ్య‌య‌నం చేస్తున్నార‌ట‌. కేజ్రీవాల్ పార్టీ పెట్టిన‌ప్పుడు ప‌రిస్థితులు ఎలా ఉన్నాయి..?. ఢిల్లీలో అప్పుడున్న స‌మస్య‌లేంటి..? కేజ్రీవాల్ ఎలాంటి స్పీచుల‌తో జ‌నాన్ని ఆక‌ట్టుకున్నారు? లాంటి అంశాలన్నీ క‌వ‌ర్ చేస్తున్నార‌ట‌. అందుకోసం ఇప్ప‌టికే ఢిల్లీ కూడా వెళ్లివ‌చ్చార‌ట ప్రొఫెస‌ర్ గారు.ఆప్ నేత‌ల‌తో క‌లిసి మాట్లాడార‌ట‌. కేజ్రీవాల్ తోనూ మీట‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

తెలంగాణ‌కు… ఢిల్లీ రాజ‌కీయాల‌కు చాలా తేడా ఉంది. అక్క‌డి ప‌రిస్థితులతో తెలంగాణ‌ను పోల్చ‌లేం. ఇవ‌న్నీ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ కు తెలియ‌నివి కాదు. కేజ్రీవాల్ ను స్ఫూర్తిగా తీసుకోవ‌డం వ‌ర‌కు ఓకే గానీ.. అన్నింట్లో కేజ్రీవాల్ ను కాపీ కొడితే వ‌ర్క‌వుట్ క‌ష్ట‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ ఊహాగానాల మాట ఎలా ఉన్నా… కొంద‌రు పొలిటిక‌ల్ నాయ‌కులు మాత్రం కోదండ‌రామ్ ను తెలంగాణ కేజ్రీవాల్ గా పిలుస్తున్నార‌ట‌!!! అయితే ఢిల్లీలో కేజ్రీవాల్ లాగే… తెలంగాణ‌లోనూ కోదండ‌రామ్ స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నారు మెజారిటీ జ‌నం.

SHARE